Gold Price: భగ్గుమంటున్న బంగారం ధరలు.. మళ్లీ లక్ష రూపాయలు..!
Gold Price Today: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు..

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ భగ్గుమంటున్నాయి. దిగి వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఎగబాకింది. మళ్లీ లక్షరూపాయల చేరువలో ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,330 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,050 వద్ద కొనసాగుతోంది. అంటే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి లక్షా 14 వేల రూపాయల వరకు చేరుకుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలలో లక్షా 24 వేల వరకు ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మరి కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఎలా వస్తాయి రా సామీ ఇలాంటి ఐడియాలు.. పాత వాషింగ్ మెషిన్‌తో ఇలా కూడా చేస్తారా? నెట్టింట్లో వైరల్
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, రూపాయి-డాలర్ మారకం రేటు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడి, ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ కొనుగోలుదారులకు ధరలు ఖరీదైనవి అవుతాయి. దీనితో పాటు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ధోరణులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒకే దిశలో కదులుతాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ఈ విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ధరలను కూడా పెంచుతుంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సంచలన నిర్ణయం.. జూలై 23 వరకు పాఠశాలలకు సెలవు!
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే టిక్కెట్ల బుకింగ్ ఎన్ని రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది? నియమాలేంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








