Higher Pension: సమయం లేదు.. రెండు రోజులు మాత్రమే గడువు.. దరఖాస్తు చేసుకోండి
మీరు ఇంకా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఇపిఎస్) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి..
మీరు ఇంకా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఇపిఎస్) కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూలై 11 చివరి తేదీ. దీని తర్వాత మీరు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేయలేరు. ఈపీఎఫ్‌వో గడువును మళ్లీ పొడిగించకపోతే ఇబ్బందులు పడనున్నారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ కోసం గడువును జూలై 11 వరకు పొడిగించారు. ఇదే చివరి తేదీ అవుతుంది. అయితే, యాజమాన్యాలు జీతం, ఇతర వివరాలను సమర్పించడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. అందువల్ల, మీరు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు అధిక పెన్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. గడువు ముగిసేలోపు మీరు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారని నిర్ధారించుకోవాలి.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీకు UAN నంబర్, ఆధార్ నంబర్, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ అవసరం. అన్ని మునుపటి కంపెనీల EPS నంబర్‌లు, అలాగే EPSలోకి ప్రవేశించిన తేదీ, ప్రతి సంస్థ కోసం ఈపీఎస్ నుంచి నిష్క్రమించిన తేదీ అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి