AUDI ELECTRIC VEHILCES PLANT: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ పెట్టే యోచనలో జర్మన్ కంపెనీ ఆడీ.. ఎప్పుడు.. ఎక్కడ..

AUDI ELECTRIC VEHILCES PLANT: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ కార్ల.. భారత్ లో తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సీనియర్ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

AUDI ELECTRIC VEHILCES PLANT: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ పెట్టే యోచనలో జర్మన్ కంపెనీ ఆడీ.. ఎప్పుడు.. ఎక్కడ..
Audi Car
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 06, 2022 | 3:53 PM

AUDI ELECTRIC VEHILCES PLANT: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ కార్ల.. భారత్ లో తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సీనియర్ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 2033 నాటికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా మారేందుంకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపాదదను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉత్పాదనను ప్రారంభించేందుకు సరైన సయంగా ఆడీ భావిస్తుండగా.. భారత్ నుంచి సానుకూలంగా రెస్పాన్స్ ఉంది.

”భారత వాహనదారులు స్పందనను మేము నిరంతరం అధ్యయనం చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు వారు ఎంత వరకు సుముఖంగా ఉన్నారో గమనిస్తున్నాం.” – ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్

2033 నాటికి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలని మాతృ సంస్థ నిర్ణయించినందున.. సరైన సయంలో, తయారీకి అనువైన ప్రాంతంలో తమ తయారీని ఖచ్చితంగా ప్రారంభిస్తామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. గడచిన ఏడునెలల కాలంలో భారత విపణిలో కొత్తగా e-tron 50, e-tron 55, e-tron Sportback 55, e-tron GT, RS e-tron GT పేర్లతో 5 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశామని.. వాటి అమ్మకాలు కొనసాగిస్తామని చెప్పారు. తాము ఊహించిన దానికంటే మంచి అమ్మకాలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.

కంపెనీ నిర్దేసించుకున్నదానికి అనుగుణంగా కొనుగోళ్లు నమోదైతే కార్లను దేశీయంగా అసెంబ్లింగ్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన కార్ల మోడళ్లు(ELECTRIC CAR MODELS) దేశీయ అవసరాలు, వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Tata Steel: టాటా స్టీల్‌కు లాభాల పంట.. త్రైమాసికంలో భారీగా పెరిగిన ఆదాయం..!

Multiple Organ Failure: మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించిన లతామంగేష్కర్.. ఇది ఎలా జరుగుతుందో తెలుసా..?

ఉద్యోగులు ఇకపై జీతం కోసం నెలాఖరు దాకా ఆగక్కర్లేదు.. ట్విట్లర్లో ప్రకటించిన ఆ కంపెనీ..