ఉద్యోగులు ఇకపై జీతం కోసం నెలాఖరు దాకా ఆగక్కర్లేదు.. ట్విట్లర్లో ప్రకటించిన ఆ కంపెనీ..
WEEKLY SALARIES: బిజినెస్ టు బిజినెస్(B2B e-commerce) సేవలు అందించే ఈ కామర్స్ సంస్థ ఇండియా మార్ట్(IndiaMART) ఉద్యోగుల వేతనాల చెల్లింపులో దేశంలోనే తొలిసారిగా నూతన ఒరవడికి తీసుకొచ్చింది..
WEEKLY SALARIES: బిజినెస్ టు బిజినెస్(B2B e-commerce) సేవలు అందించే ఈ కామర్స్ సంస్థ ఇండియా మార్ట్(India MART) ఉద్యోగుల వేతనాల చెల్లింపులో దేశంలోనే తొలిసారిగా నూతన ఒరవడికి తీసుకొచ్చింది. ఇకపై తమ సంస్థలో పనిచేస్తున్నవారు జీతం కోసం నెలాకరు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికి అనుగుణంగా కంపెనీ తాజాగా ఉద్యోగులకు జీతాన్ని ఏ వారానికి.. ఆ వారం చెల్లించాలని నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని.. వారు మెరుగైన పనితీరు కనబరిచేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగులకు అనువైన విధంగా పనిలో ఫ్లెక్సిబిలిటీ, మెరుగైన ఆర్ధిక స్థితి కల్పించే ఉద్దేశంతో దేశంలో తొలుతగా తమ సంస్థ ఈ నూతన విధానాన్ని అమలుకు శ్రీకారం చుట్టిందిని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను మెరుగ్గా నిర్వహించుకోవడానికి ఈ పద్ధతి ఎంతగానో దోహదపడుతుందని సంస్థ చెబుతోంది. జీతం కావాలంటే నెలాకరు వరకు వేచి ఉండడం, తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకోవడం వంటి పాత కాలం పద్ధితికి తాము ఈ నిర్ణయంతో స్వస్తి పలకుతున్నట్లు పేర్కొంది. ఉద్యోగి వెల్నెస్‌ను ప్రోత్సహించే దిశగా.. కంపెనీ వేస్తున్న అడుగుల్లో ఇది పెద్ద నిర్ణయమని చెప్పింది. న్యూజిలాండ్, ఆస్టేలియా, హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో వారాంతపు జీతాల చెల్లింపు ప్రక్రియ సహజసాధారణమైనదేనని ఇండియా మార్ట్ అంటోంది.
పని గంటల ఆధారంగా జీతాలు పొందే ఉద్యోగులకు ఈ ప్రక్రియ బాగా ఉపకరిస్తుందని.. ఈ పద్ధతి వల్ల ఉద్యోగులకే కాక సంస్థకు కూడా అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పుకొచ్చింది.
డిసెంబర్ 2021 త్రైమాసికంలో ఇండియామార్ట్ ఏకీకృత నికర లాభంలో 12.4 శాతం క్షీణించి ₹70.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ₹80.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022 మూడో త్రైమాసికంలో దీని ఆదాయం రూ.173.6 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి ₹188.1 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.
ఇవీ చదవండి:
Private Employees: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. భారీగా పెరగనున్న వేతనాలు..!
ఆర్బీఐ మాట కోసం మదుపరుల ఎదురుచూపు.. ఈ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయంటే..