Nirav Modi: పీఎన్‌బీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. సీబీఐ అదుపులో నీరవ్‌ మోడీ ప్రధాన అనుచరుడు..

PNB Loan Fraud: దేశంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Nirav Modi: పీఎన్‌బీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. సీబీఐ అదుపులో నీరవ్‌ మోడీ ప్రధాన అనుచరుడు..
Pnb Loan Fraud
Follow us

|

Updated on: Apr 12, 2022 | 2:57 PM

PNB Loan Fraud: దేశంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి (Nirav Modi) ప్రధాన అనుచరుడు సుభాష్‌ శంకర్‌ పరబ్‌ను భారత్‌కు తీసుకొచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈజిప్టు రాజధాని కైరోలో తలదాచుకున్న అతడిని అక్కడి ప్రభుత్వంతో దౌత్యపరంగా, చట్టపరంగా చర్చలు జరిపి ముంబైకు తీసుకొచ్చారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13,500 కోట్ల ఎగవేసిన కేసులో నీరవ్‌ మోడీతో పాటు పరబ్‌ కూడా ఓ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ కంపెనీ ఫైనాన్స్‌ విభాగంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పరబ్‌ వ్యవహరించేవారు. పీఎన్‌బీకి సమర్పించిన నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (LoUs) ఇతడినే ప్రత్యక్షసాక్షి అని సీబీఐ భావిస్తోంది.

కస్టడీకి కోరే అవకాశం..

కాగా నకిలీ ఎల్‌వోయూలతో బ్యాంకును మోసగించిన వ్యవహారం 2018 జనవరిలో బయటపడింది. అప్పటికే నీరవ్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పరబ్‌ కూడా దేశం విడిచి పారిపోయాడు. దీంతో జూలై 2018లో ఇంటర్‌పోల్ నీరవ్ మోడీతో సహా పరబ్‌పై నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం తదితర ఆరోపణల కింద పరాబ్‌పై రెడ్ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ ప్రస్తుతం లండన్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు. ఇక పరారీలో ఉన్న పరబ్‌ కైరో శివారులో ఉన్న ఓ రహస్య ప్రాంతంలో ఉన్నట్లు భారత అధికారులకు సమాచారంఅందింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న అతని భద్రతకు ప్రమాదం ఉందని పసిగట్టి వెంటనే ఈజిప్టు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆతర్వాత ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని అదుపులోకి తీసుకుంది. కాగా సుభాష్ ను ముంబై సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

Also Read:Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!

Fruit Cream: ఫ్రూట్స్ తినాలంటే బోర్ కొడుతోందా.. అయితే, ఇలా ట్రై చేయండి..

Pawan Kalyan: అనంతపురం జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..