AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Price: వాహనదారులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. పెట్రోడ్, డీజిల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్..

గత 10 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 35 శాతం కంటే ఎక్కువగా తగ్గింది.

Fuel Price: వాహనదారులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. పెట్రోడ్, డీజిల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్..
Petrol, Diesel Price
Shiva Prajapati
|

Updated on: Nov 23, 2022 | 6:53 AM

Share

గత 10 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 35 శాతం కంటే ఎక్కువగా తగ్గింది. WTI క్రూడ్ ఆయిల్ ధర 38 శాతానికి పైగా తగ్గింది. నిపుణులను విశ్లేషణల ప్రకారం.. రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు మరింత తగ్గవచ్చు. దాదాపు 5 డాలర్ల మేర తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బ్రెంట్ క్రూడ్ ధర 82 డాలర్లకు తగ్గడంతో పాటు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అంటే దీని ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ.5 తగ్గుదల కనిపించవచ్చు.

10 నెలల్లో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర..

గత 10 నెలలుగా ముడిచమురు ధరలో 35 శాతానికి పైగా క్షీణత కనిపించింది. మార్చి 7న బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 139.13 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో బ్యారెల్‌కు $ 87.81 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ మధ్య కాలంలో బ్రెంట్ క్రూడాయిల్ ధరలో బ్యారెల్‌కు 37 డాలర్ల పతనం కనిపించింది. WTI ధర మార్చి 7న బ్యారెల్‌కు $ 130.50 గరిష్టంగా ఉండగా, ఇది బ్యారెల్‌కు $ 80.41కి తగ్గింది. ఈ మధ్య కాలంలో WTI 38 శాతానికి పైగా క్షీణించింది.

ధర ఎంత తగ్గొచ్చు..

ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమోడిటీ అండ్‌ కరెన్సీ) అనూజ్‌ గుప్తా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ముడి చమురు ధర మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ క్షీణత బ్యారెల్‌కు $ 5 కంటే ఎక్కువగా ఉండవచ్చు. అందుకు ఆయన 4 కారణాలను పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

1. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు సంవత్సరాంతంలో తమ పాత హెడ్జ్ ఫండ్లను లిక్విడేట్ చేయడం గురించి ఆలోచిస్తాయి. దీంతో చమురు డిమాండ్‌ తగ్గుతుంది.

2. అమెరికాలో స్టాక్స్, షెల్స్ పెరుగుదల ఉండవచ్చు. దీంతో డిమాండ్‌ కంటే సరఫరా కూడా పెరిగిందని, దీంతో రానున్న రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

3. చైనాలో కోవిడ్ మరోసారి కోరలు చాస్తోంది. దీని కారణంగా మళ్లీ మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తోంది. ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా కోవిడ్ కొత్త వేవ్ వస్తుందని భయపడుతున్నాయి. దీని కారణంగా డిమాండ్ నిరంతరం తగ్గుతోంది.

4. ఇటీవల UK ప్రధాన మంత్రి రిషి సునక్ తమ దేశంలో ముడి చమురు కోసం డ్రిల్లింగ్‌ను పెంచుతానని చెప్పారు. దాంతో యూరప్‌లోని ఇతర దేశాలు కూడా డ్రిల్లింగ్‌ను పెంచాయి. దీని కారణంగా ఉత్పత్తి పెరిగే అవకాశాలు పెరిగాయి.

భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

మన దేశం ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గింపు ప్రభావం భారత్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రెండు వారాల్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరితే.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ. 5 తగ్గే అవకాశం ఉందని అనూజ్‌ గుప్తా తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..