Forex Reserves: 10 వారాలుగా భారత్ వద్ద కరిగిపోతున్న కరెన్సీ నిల్వలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు..

Forex Reserves:  మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తరిగిపోవటం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇతర దేశాల నుంచి కీలక దిగుమతులకు సైతం చెల్లింపులు చేసేందుకు సరిపడా మారక నిల్వలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి.

Forex Reserves: 10 వారాలుగా భారత్ వద్ద కరిగిపోతున్న కరెన్సీ నిల్వలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు..
Forex Reserves (Representative Image)
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 21, 2022 | 3:40 PM

Forex Reserves:  మన చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తరిగిపోవటం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇతర దేశాల నుంచి కీలక దిగుమతులకు సైతం చెల్లింపులు చేసేందుకు సరిపడా మారక నిల్వలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. గత కొన్ని వారాలుగా భారత్ వద్ద సైతం కరెన్సీ నిల్వలు తరిగిపోవటం చూస్తుంటే పరిస్థితులు అందోళనకరంగా ఉన్నాయని అర్థమౌతోంది. దీనిపై ఆర్థిక వేత్తలు, నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దిగుమతులు భారంగా మారతాయని, ఇదే సమయంలో రూపాయి విలువ పతనం అవుతున్నందున దిగుమతులు ఖరీదుగా మారతాయని వారు అంటున్నారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులపై రిజర్వు బ్యాంకి ఇచ్చిన వివరాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. దీనిని కట్టడి చేసేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితంలో మాత్రం మార్పు రావటం లేదు. మార్చి 13తో ముగిసిన వారానికి భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు 2.67 బిలియన్ డాలర్లు కరిగిపోయి 593.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ నిన్న వెల్లడించింది. అంతకు ముందు వారం మారక నిల్వలు 1.77 బిలియన్ డాలర్లు పడిపోయి 595.95 బిలియన్ డాలర్లు భారత్ వద్ద ఉన్నాయి. మే నెలకు సంబంధించి రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం పది నెలల దిగుమతులకు సరిపడా 596 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని.. అవి 2022-23లో అంచనా వేసిన దిగుమతుల చెల్లింపులకు సరిపోతాయని తెలిపింది.

తాజా వారంలో మారక నిల్వలు తరిగిపోవటానికి ఫారెన్ కరెన్సీ అసెట్స్ తగ్గిపోవటమే కారణంగా తెలుస్తోంది. ఫారెన్ కరెన్సీ అసెట్స్ 1.302 బిలియన్ డాలర్లు తగ్గటంతో వాటి విలువ 529.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటిలో ఇతర దేశాలకు చెందిన కరెన్సీ నిల్వల విలువ హెచ్చుతగ్గులను డాలర్లలో మార్చి లెక్కగడతారు. బంగారం నిల్వలు 1.169 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవటంతో వాటి విలువ 40.57 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ఉన్న భారత నిల్వలు కూడా తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!