TRAI: స్పామ్ నంబర్ల నుంచి కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఇకపై True Caller అవసరం లేకుండానే..

TRAI: ఎప్పుడైనా ఉదయాన్ని ప్రశాంతంగా పనిచేసుకోవాలని అనుకున్నప్పుడు స్పామ్ నంబర్ల నుంచి మీకు కాల్స్ వచ్చాయా. లోన్లు, రియల్ ఎస్టేట్, ఇతర సేవలకు సంబంధించి కాల్స్ మిమ్మల్ని విసిగించిన సంఘటనలు తప్పక ఎదురయ్యే ఉంటాయి.

TRAI: స్పామ్ నంబర్ల నుంచి కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. ఇకపై True Caller అవసరం లేకుండానే..
Mobile
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 21, 2022 | 5:27 PM

TRAI: ఎప్పుడైనా ఉదయాన్ని ప్రశాంతంగా పనిచేసుకోవాలని అనుకున్నప్పుడు స్పామ్ నంబర్ల నుంచి మీకు కాల్స్ వచ్చాయా. లోన్లు, రియల్ ఎస్టేట్, ఇతర సేవలకు సంబంధించి కాల్స్ మిమ్మల్ని విసిగించిన సంఘటనలు తప్పక ఎదురయ్యే ఉంటాయి. మెుబైల్ వినియోగదారుల సంఖ్యతో పాటు ఇలాంటి స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి కాల్ వచ్చినప్పుడు వారి పేరు మెుబైల్ స్కీన్ పై వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ట్రాయ్ మెుబైల్ ఆపరేటర్లకు సూచించింది. ఇప్పటి వరకు మన ఫోన్ లో సేవ్ చేసుకున్న వ్యక్తులు కాల్ చేసినప్పుడే వారి పేరు కాల్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇకపై తెలియని వ్యక్తులు, లేదా నంబర్ల నుంచి కాల్ వచ్చినా ఇలాగే సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని టెలికాం రెగ్యులేటరీ ఆలోచిస్తోంది. రానున్న కాలంలో ఇది వాస్తవ రూపం దాల్చుతుందని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా అన్నారు.

ఎవరైనా మనకు తెలియని వ్యక్తి కాల్ చేస్తే వారి మెుబైల్ కనెక్షన్ తీసుకునేసమయంలో ఆపరేటర్ కు అందించిన కేవైసీ వివరాల్లోని పేరును కాల్ సమయంలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రాయ్ కి సంబంధించిన ఒక అధికారి వెల్లడించారు. ఇలాంటి స్పామ్ కాల్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాలర్ ID ఫీచర్ సమ్మతి-ఆధారిత, స్వచ్ఛంద ప్రోగ్రామ్‌గా ప్లాన్ చేయటం జరుగుతోంది. దీనిలో చందాదారులు తమ పేర్లను ప్రదర్శించాలా వద్దా అని ఎంచుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో కమ్యూనిటీ-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సర్వే చేసిన 9,623 మొబైల్ వినియోగదారుల్లో 64 శాతం మంది తమకు రోజుకు కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..