Youtube: యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన యూట్యూబ్‌.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకే..

Youtube: ఇంటర్‌నెట్ విస్తృతి పెరగడంతో యూట్యూబ్‌ వాడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చాలా మంది ఔత్సాహికులు వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే యూజర్ల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోవడానికి....

Youtube: యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన యూట్యూబ్‌.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకే..
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2022 | 2:40 PM

Youtube: ఇంటర్‌నెట్ విస్తృతి పెరగడంతో యూట్యూబ్‌ వాడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చాలా మంది ఔత్సాహికులు వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే యూజర్ల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోవడానికి, ఎలాగైనా వీడియోను క్లిక్‌ చేయించడం కోసం ఆకట్టుకుకేనే థంబ్‌నెయిల్స్‌ పెడుతుంటారు. కంటెంట్‌లో ఉన్న మ్యాటర్‌ ఒకటి అయితే, థంబ్‌నెయిల్‌ మరోలా ఉండడంతో సహజంగానే చిరాకు పడుతుంటాం. అందులోనూ కంటెంట్‌లో ముఖ్యమైన సమాచారం 2 నిమిషాల నిడివి ఉంటే, వీడియో మాత్రం 20 నిమిషాలు ఉంటుంది. దీంతో యూజర్లు ఇబ్బంది పడుతుంటారు.

అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే యూట్యూబ్‌ వినూత్న ప్రయత్నం చేసింది. సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మోస్ట్‌ రీప్లేడ్‌ పేరుతో తీసుకొచ్చిన ఫీచర్‌తో యూజర్లు సమయంతో పాటు డేటాను కూడా సేవ్‌ చేసుకోవచ్చు. మొన్నటి వరకు ఈ ఫీచర్‌ ప్రీమియం సబ్‌స్కై్బర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌తో ఎక్కువ మంది యూజర్లు వీడియోలో ఏ భాగాన్ని అయితే రీపిటెడ్‌గా చూశారో దానిని చూపిస్తుంది.

వీడియోలోని మోస్ట్‌ రీప్లేడ్ పార్ట్ తెలిసేలా వీడియో పక్కన ప్రొగ్రెసివ్‌ బార్‌ గ్రాఫ్‌ ఉంటుంది. అందులో యూజర్లు ఎక్కువగా చూసిన వీడియో నిడివి దగ్గర బార్‌ గ్రాఫ్ పెద్దదిగా కనిపిస్తుంది. దాంతో యూజర్లు సులువుగా వీడియోలో మోస్ట్ రీప్లేడ్ కంటెంట్‌ను చూడొచ్చు. యూట్యూబ్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో నిజంగానే సమయాన్ని వృథా చేసుకోవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు కదూ!

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..