Apple Door detection: దృష్టిలోపం ఉన్న వారి కోసం యాపిల్‌ అద్భుత ఆవిష్కరణ.. పనితీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Apple Door detection: సరికొత్త ఆవిష్కరణల్లో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. దృష్టి లోపం ఉన్న వారికి కోపం యాక్సెసిబిలిటీ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను..

Apple Door detection: దృష్టిలోపం ఉన్న వారి కోసం యాపిల్‌ అద్భుత ఆవిష్కరణ.. పనితీరు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Apple Door Detection Featur
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2022 | 4:10 PM

Apple Door detection: సరికొత్త ఆవిష్కరణల్లో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. దృష్టి లోపం ఉన్న వారికి కోపం యాక్సెసిబిలిటీ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగా డోర్‌ డిటెక్షన్‌ అనే ఫీచర్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌లో చూపించిన దాని ప్రకారం.. దృష్టిలోపం ఉన్న వారు యాపిల్‌ ఫోన్‌ రెయిర్‌ కెమెరా ద్వారా యూజర్లకు మార్గనిర్దేశం చేస్తుంది.

డోర్‌ హ్యాండిల్‌ను తిప్పాలా.? లాగడం లేదా నెట్టాలా అనే విషయాలను వాయిస్‌ కమాండ్‌ రూపంలో తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇందులోని మెషిన్‌ లెర్నింగ్ టెక్నాలజీ డోర్‌పై ఉన్న సందేశాలను చదివి వినిపిస్తుంది. దీంతో దృష్టిలోపం ఉన్న వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ టెక్నాలజీ కోసం యాపిల్‌ LiDAR ఫీచర్‌ కెమెరా, ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను వినియోగిస్తున్నారు. డోర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో పాటు మాగ్నిఫైయర్‌ అనే యాప్‌ను కూడా తీసుకురానున్నారు. దీని ద్వారా వ్యక్తులను గుర్తించడానికి, పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని యాపిల్‌ తెలిపింది.

యాపిల్‌ డోర్‌ డిటెక్షన్‌ ఇలా పనిచేస్తుంది..

ఈ కొత్తరకం ఫీచర్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్‌ 13 ప్రో, ప్రో మ్యాక్స్‌, 2 ప్రో మ్యాచ్స్‌, ఐప్యాడ్‌ ప్రో-2020, 2021, 2020 మోడల్స్‌ అప్‌డేట్‌లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది యాపిల్‌.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..