Forex Reserves: భారత్ వద్ద కరిగిపోతున్న విదేశీ డబ్బు.. ఈ వారం ఎంత తగ్గిపోయిందంటే..

Forex Reserves: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు మరోసారి తగ్గాయి. జూన్ 3, 2022తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు తగ్గాయి. వరుసగా 10 వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Forex Reserves: భారత్ వద్ద కరిగిపోతున్న విదేశీ డబ్బు.. ఈ వారం ఎంత తగ్గిపోయిందంటే..
Forex Reserves (Representative Image)
Follow us

|

Updated on: Jun 11, 2022 | 12:01 PM

Forex Reserves: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు మరోసారి తగ్గాయి. జూన్ 3, 2022తో ముగిసిన వారంలో.. అవి 306 మిలియన్ డాలర్ల మేర తగ్గి.. 601.057 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత వారం గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వలు 3.854 బిలియన్ డాలర్లు పెరిగి 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మే 20తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 4.23 బిలియన్ డాలర్లు పెరిగి 597.509 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

గత నెలలో ఇలా..

విదేశీ మారక నిల్వలు ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో వరుసగా 10 వారాల పాటు నిల్వలు తగ్గాయి. ఇది మే 20, 2022, మే 27, 2022తో ముగిసే వారంలో మాత్రం పెరిగాయి. RBI వారాంతపు గణాంకాల ప్రకారం.. మే 27 నాటి వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 3.854 బిలియన్ డాలర్లు పెరిగి 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

జూన్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మళ్లీ 306 మిలియన్ డాలర్ల మేర పడిపోయాయి. రిపోర్టింగ్ వారంలో విదేశీ మారక నిల్వలు క్షీణించడానికి కారణం మొత్తం నిల్వల్లో ముఖ్యమైన భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడమేనని తెలుస్తోంది. ఈ కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎలు) 208 మిలియన్ డాలర్లు తగ్గి 536.779 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్లలో ప్రకటించేందుకు వీలుగా.. మారక నిల్వల్లో ఉన్న ఇతర విదేశీ కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ తో పాటు ఇతర విదేశీ కరెన్సీ ఆస్తులను లెక్కించటం జరుగుతుంది.

బంగారం నిల్వలు కూడా తగ్గాయి..

సమీక్షా కాలంలో బంగారం నిల్వల విలువ కూడా 74 మిలియన్ డాలర్లు తగ్గి 40.843 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRలు) 28 మిలియన్ డాలర్లు తగ్గి 1841 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. IMF వద్ద ఉన్న దేశ కరెన్సీ నిల్వలు 500 మిలియన్ డాలర్ల మేర పెరిగి 5.025 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.