Flying Bike: ప్రపంచంలో మొట్టమొదటి గాల్లో ఎగిరే బైక్.. వీడియో వైరల్
Flying Bike: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎ..
Flying Bike: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గాల్లో నడిచేవి అంటే విమానాలు మాత్రమే. అయితే ఇటీవల గాల్లో ఎగిరే కార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గాల్లో ఎగిరే మొట్టమొదటి బైక్ వచ్చేస్తోంది. ఈ గాల్లో ఎగిరే బైక్‌ను జపాన్‌కు చెందిన అలీ టెక్నాలజీస్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. దాదాపు అరగంట పాటు గాల్లో తిరుగుతుంది. నిజ జీవితంలో వీడియోలలో ఎగిరే కార్లను చూసి ఉంటాము. కానీ జపాన్ ఈ వారంలో ఒ ప్రదర్శనలో ఒక ఎగిరే బైక్‌ను ప్రవేశపెట్టింది. కొంత కాలంగా ఫ్లయింగ్ బైక్‌లను అభివృద్ధి చేస్తున్న జపాన్‌కు చెందిన అలీ టెక్నాలజీస్.. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రాక్టికల్ హూవర్ బైక్ ఎడిషన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఫుజిలోని రేసింగ్ ట్రాక్ వద్ద ప్రదర్శన సందర్భంగా ఈ బైక్‌ను ప్రదర్శించింది. అలాగే ఈ టెక్నాలజీస్ ఇప్పటికే అంటే అక్టోబర్ 26 నుండి లిమిటెడ్ ఎడిషన్ కోసం బుకింగ్‌ను ప్రారంభించింది.
ఈ హూవర్ ఫ్లయింగ్ బైక్ పెట్రోల్‌తో పని చేస్తుందని, అంతేకాకుండా విద్యుత్‌తో కూడా గాల్లో ఎగురుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫ్లయింగ్ బైక్‌లను 2025 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
ఈ బైక్ బరువు 300 కిలోలు:
కంపెనీ వివరాల ప్రకారం.. ఈ ఫ్లయింగ్ బైక్ 300 కిలోల వరకు ఉంటుంది. ఈ ఎగిరే బైక్ పొడవు 3.7 మీటర్లు, వెడల్పు 2.4 మీటర్లు, ఎత్తు 1.5 మీటర్లు. ఇది ప్రస్తుతానికి పైలట్ మాత్రమే కూర్చోగలడు.
ఈ సందర్భంగా అలీ టెక్నాలజీస్ ప్రసిడెంట్, సీఈవో డైసుకే కటానో మాట్లాడుతూ.. మేము2017లోనే హూవర్‌బైక్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించాము. భవిష్యత్తులో ఎయిర్ మొబిలిటీ విస్తరిస్తుందని అంచనా వేశాము. అయితే దీనిని సర్క్యూట్‌లు, పర్వతా ప్రాంతాలలో ఉపయోగించాలని భావించాము. తొలిసారిగా ఈ ప్లయింగ్ బైక్‌ను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ లిమిటెడ్ ఫ్లయింగ్ బైక్‌ల మొదటి యూనిట్ల డెలివరీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం అవుతుందని సీఈఓ తెలిపారు.