FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై రాబడి వరద.. ఆకర్షణీయ వడ్డీ రేట్లు మీ సొంతం

భారతదేశంలో చాలా మంది ప్రజలు పొదుపుపై ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. ముఖ్యంగా రిస్క్ లేని పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.  అయితే ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల బ్యాంకులకు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు రుణదాతలు డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు త్వరలో రేట్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రస్తుతం 7.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి.

FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై రాబడి వరద.. ఆకర్షణీయ వడ్డీ రేట్లు మీ సొంతం
Money
Follow us
Srinu

|

Updated on: Sep 11, 2024 | 3:32 PM

భారతదేశంలో చాలా మంది ప్రజలు పొదుపుపై ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. ముఖ్యంగా రిస్క్ లేని పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి పథకాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.  అయితే ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల బ్యాంకులకు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు రుణదాతలు డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకులు త్వరలో రేట్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రస్తుతం 7.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుతం, భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డిపాజిటర్ వయస్సు పదవీకాలాన్ని బట్టి రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.9 శాతం వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 7.8 శాతం వరకు ఇస్తుండగా, యాక్సిస్ బ్యాంక్ 7.75 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల్లో వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు

  • ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు  3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుంచి ఆరు నెలల కంటే తక్కువ వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ వ్యవధి వరకు సాధారణ ప్రజలకు  6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 7.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం
  • 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం

యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 3 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 3 నెలల నుంచి  6 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 6 నెలల నుండి 9 నెలల కంటే తక్కువ వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
  • 9 నెలల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధి వరకు సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
  • 16 నెలల నుంచి 17 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
  • 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం

ఐసీఐసీఐ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు

  • ఏడు రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!