Bank Holiday: ఫిబ్రవరి 26, 27.. ఏ రోజున బ్యాంకులు మూసి ఉంటాయి?
Bank Holiday: ప్రతి నెల బ్యాంకులకు సెలవులను విడుదల చేస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). అయితే ఫిబ్రవరిలో సగం రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇప్పుడు ఈ నెల పూర్తి కావస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మహా శివరాత్రి పండగ రానుంది. మరి పండగ ఫిబ్రవరి 26, లేదా 27న ఏ రోజు వస్తుంది. బ్యాంకులు ఏ రోజు మూసి ఉండనున్నాయి?

సంవత్సరంలో రెండవ నెల పూర్తి కావస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ఫిబ్రవరి నెలకు బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేయగా, ఈనెల 26న శివరాత్రి ఉంది. అయితే శివరాత్రి రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? కొందరు శివరాత్రి పండగ 27న అని కూడా చెబుతున్నారు. మరి ఏ రోజు పండగ అవుతుంది? ఆ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా ?అనే ప్రశ్న తలెత్తుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. దేశం మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి ఫిబ్రవరి 26న రానుంది. దీంతో ఆ రోజు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఏపీ, తెలంగాణ జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, తిరువనంతపురం, రాంచీ, షిమ్లాలలో బ్యాంకులు పనిచేయవు.
సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్‌లు హాలిడేస్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇవి 24 గంటలూ పని చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




