Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

Kotak Mahindra Bank: సాధారణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed deposits) చేసేవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది...

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2022 | 9:26 AM

Kotak Mahindra Bank: సాధారణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed deposits) చేసేవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇక ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తాజాగా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల (Interest Rates)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు డొమెస్టిక్‌, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ కస్టమర్లకు వర్తించనున్నట్లు కోటక్‌ మహీంద్రా తెలిపింది. ఈ వడ్డీ రేట్లు మార్చి 9 నుంచి అమల్లోకి వచ్చాయి.

కొత్త వడ్డీ రేట్లు ఇలా..

రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ఖాతాలపై ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెంచింది. గతంలో 4.9 శాతం ఉండేది. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు 50 బేసిస్‌ పాయింట్ల వరకు అదనపు వడ్డీ రేట్లు లభించనున్నాయి.

  1. 7 రోజుల నుంచి 30 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం
  2. 31 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 2.75 శాతం
  3. 91 రోజుల నుంచి 120 రోజుల కాల పరిమితి ఎఫ్‌డీలపై 3 శాతం
  4. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు
  5. 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్‌డీలపై 4.4 శాతం
  6. 364 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం
  7. 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.1 శాతం వడ్డీ
  8. 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.45 శాతం వడ్డీ
  9. 5 సంతవ్సరాలకు మించిన ఎఫ్‌డీలపై 5.5 శాతం

గత నెలలో హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు సహా ఇతర బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాలపరిమితిపై వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా యాక్సిస్‌ బ్యాంకు కూడా రెండోసారి వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

Axis Bank Jobs: మహిళలకు శుభవార్త.. పట్టణాల్లోని వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఉద్యోగాలు..

330 పెట్టుబడిపై 2 లక్షల ప్రయోజనం.. కానీ ఈ వయసు వారికి మాత్రమే..!