Exports and Imports: ఎగుమతులు.. దిగుమతుల్లో భారీ పెరుగుదల.. ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చిన సెప్టెంబర్
కోవిడ్ తరువాత మన ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మన దేశం నుంచి ఎగుమతులు.. దిగుమతులు సెప్టెంబర్ లో అధిక వృద్ధిని నమోదు చేశాయి. ఎ
Exports and Imports: కోవిడ్ తరువాత మన ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. మన దేశం నుంచి ఎగుమతులు.. దిగుమతులు సెప్టెంబర్ లో అధిక వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు సంవత్సరానికి 21.35% పెరిగి సెప్టెంబర్ 2021 లో 33.44 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది సెప్టెంబర్ 2020 లో27.02 బిలియన్ డాలర్లు మాత్రమే. అలాగే, సెప్టెంబర్ 2019 లో $ 26.02 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. సెప్టెంబర్‌లో, దిగుమతులు 84.75% పెరిగి 56.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఒక సంవత్సరం క్రితం అంటే సెప్టెంబర్ 2020 లో ఇది 30.52 బిలియన్ డాలర్లు. ఇది సెప్టెంబర్ 2019 లో 37.69 బిలియన్ డాలర్లు.
వాణిజ్య లోటు 22.94 బిలియన్ డాలర్లు..
సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 22.94 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు పెరగడమే దీనికి కారణం. పసిడి దిగుమతులు దాదాపు 750% పెరిగి 5.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో వాణిజ్య లోటు 78.81 బిలియన్ డాలర్లుగా ఉంది. వస్తువుల ఎగుమతి సెప్టెంబర్ 2021 లో 33.44 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది సెప్టెంబర్ 2020 లో 27.56 బిలియన్ డాలర్ల ఎగుమతి కంటే 21.35% ఎక్కువ. సెప్టెంబర్ 2019 లో 26.02 బిలియన్ దాలరాల్ ఎగుమతి కంటే 28.51% ఎక్కువ.
సెప్టెంబర్ 2020 తో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 40% పెరిగాయి. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 36.7% పెరిగి 9.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి 39.32% పెరిగి 4.91 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డేటా ప్రకారం, రత్నాలు, ఆభరణాల ఎగుమతి 19.71% పెరిగి 3.23 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ కాలంలో, ఔషధాల ఎగుమతి 8.47%తగ్గింది.
ముడి చమురు దిగుమతులు 200% పెరిగాయి..
దేశంలో ముడి చమురు దిగుమతులు దాదాపు 200% పెరిగి సెప్టెంబర్‌లో 17.436 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబరులో నాన్-పెట్రోలియం ఎగుమతులు 28.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2020 తో పోలిస్తే 18.72%, సెప్టెంబర్ 2019 తో పోలిస్తే 26.32% ఇది పెరిగింది. డేటా ప్రకారం, సెప్టెంబర్ 2021 లో పెట్రోలియం, రత్నాలు, ఆభరణాల ఎగుమతుల విలువ 18.59% పెరిగి 25.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
H1 ఎగుమతులలో 57% పెరిగాయి
ఆర్ధిక సంవత్సరం 2021-22 మొదటి అర్ధభాగంలో 197.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో 125.61 బిలియన్ డాలర్లకు గాను 56.92% పెరుగుదల అదేవిధంగా 2019 ఏప్రిల్-సెప్టెంబర్‌లో 23.84% కంటే పెరుగుదల ఉంది.
ఇవి కూడా చదవండి..
Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? ఇలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది..!
Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్ అథెంటికేషన్ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!