AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఆటో క్లెయిమ్‌తో ఆ సమస్య ఫసక్..!

భారతదేశంలో జనభాకు అనుగుణంగా ఉద్యోగులు సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే వీరికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా పొదుపు పథకాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 7.5 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఉన్నారు.

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఆటో క్లెయిమ్‌తో ఆ సమస్య ఫసక్..!
Epfo
Nikhil
|

Updated on: Jun 26, 2025 | 1:28 PM

Share

పీఎఫ్ సభ్యులకు పెద్ద ఉపశమనం కలిగించేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉపసంహరణలకు ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అత్యవసర సమయాల్లో సభ్యులు నిధులను మరింత త్వరగా పొందడంలో సహాయపడే లక్ష్యంతో ఈ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల తెలిపారు. నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేయడానికి కొత్త నియమం రూపొందించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020 లో ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఆటో-క్లెయిమ్ సౌకర్యం గతంలో అనారోగ్యానికి ఉపసంహరణలకు మాత్రమే పరిమితం చేశారు. విద్య, వివాహం, ఇంటి నిర్మాణం వంటి ముఖ్యమైన అవసరాలను తీర్చడానికి అప్‌డేట్ చేశారు.

వేగవంతమైన ప్రాసెసింగ్

95 శాతం క్లెయిమ్‌లు ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. ఇది మునుపటి 10 రోజుల కాలక్రమం కంటే గణనీయమైన మెరుగుదలగా ఉంది.

యూపీఐ, ఏటీఎం

మే–జూన్ 2025 నాటికి ఈపీఎఫ్ఓ ​​సభ్యులు యూపీఐ, ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

క్లెయిమ్ తిరస్కరణ

క్లెయిమ్ తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.దీనివల్ల క్లెయిమ్ ఆమోదం పొందే అవకాశాలు పెరిగాయి.

డాక్యుమెంటేషన్

కేవైసీ పూర్తయి, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లింక్ చేస్తే ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.

ఏఐ అనుసంధానంతో..

ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు యూఏఎన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, వారి కేవైసీ వివరాలను ధ్రువీకరించవచ్చు. అలాగే అతి తక్కువ ప్రయత్నంతో ఆన్‌లైన్ క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చు. యూఏఎన్‌ ఆధార్‌తో లింక్ చేసిన తర్వాత బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి యజమాని అనుమతి అవసరం లేదు. పెన్షన్, బీమా, పీఎఫ్ ఉపసంహరణలతో సహా అన్ని క్లెయిమ్‌లను 72 గంటల్లో పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ ​​లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ సాయం చేస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..