EPFO: మొదటి సారి ఉద్యోగం చేసేవారికి శుభవార్త.. కేంద్రం కొత్త స్కీమ్
ఈ పథకం EPFOలో నమోదు చేసుకున్న అన్ని కంపెనీలకు వర్తిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో..

ఈపీఎఫ్ఓ (EPFO) అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశంలోని ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించిన సంస్థ. అధికారిక ఉపాధి, ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నంలో భాగంగా సంగారెడ్డిలోని ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోని మెస్సర్స్ డెలాయిట్ కన్సల్టింగ్ ఇనిడా ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన, సాంకేతిక పురోగతులపై ఒక సెమినార్ నిర్వహించింది. ఈపీఎఫ్‌వో గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించింది.
ఇది కూడా చదవండి: Fridge: ఫ్రిజ్‌పై సోషల్ మీడియాలో జరిగే ప్రచారం నిజమేనా..? మీరు నమ్మతున్నారా?
ఇదిలా ఉండగా, ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రధానమంత్రి వికాసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY)ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో 3.5 కోట్లకు పైగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ పథకం లక్ష్యం. దీని కోసం ప్రభుత్వం రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను నిర్ణయించింది. ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒక భాగం ఉద్యోగులకు, మరొక భాగం యజమానులకు (కంపెనీలు).
మొదటిసారి ఉద్యోగం చేస్తున్నవారికి పెద్ద ప్రయోజనం..
మీరు మొదటిసారి ఒక కంపెనీలో పని చేయబోతున్నట్లయితే, మీ జీతం నెలకు లక్ష కంటే తక్కువ ఉంటే ఈ పథకం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పీఎం వికాసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం పార్ట్ A కింద అటువంటి ఉద్యోగులు ప్రభుత్వం నుండి రూ. 15,000 వరకు ఈపీఎఫ్ జీతం ప్రోత్సాహకాన్ని పొందుతారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అందిస్తారు. 6 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత మొదటి విడత అందిస్తుండగా, రెండో విడత 12 నెలల సర్వీస్ పూర్తియిన తర్వాత.
ఇది కూడా చదవండి: AC Blast: మీ ఏసీ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? అయితే పేలుడుకు సంకేతాలు.. జాగ్రత్త!
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు 1 నుంచి ప్రారంభ అయ్యింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులు అంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి కొత్తగా ప్రారంభిస్తున్న పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) కింద రూ.15,000 లభిస్తాయి.
ఈ పథకం రెండు విధాలుగా ప్రోత్సాహాలు అందిస్తుంది. ఒకటి మొదటిసారి ఉద్యోగుల కోసం, మరొకటి యజమానుల కోసం. ఇందులో భాగంగా మొదటి సారిగా ఉద్యోగంలో చేరిన (ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి) వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. అర్హత కలిగిన ఉద్యోగులు (రూ .1 లక్ష వరకు వేతనం ఉన్నవారు) రూ .15,000 అందుకునే ప్రయోజనం పొందుతారు.
ఏ కంపెనీలు ప్రయోజనం పొందుతాయి?
ఈ పథకం EPFOలో నమోదు చేసుకున్న అన్ని కంపెనీలకు వర్తిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న యాజమాన్యాలకూ ఈ పథకం కింద ప్రోత్సాహాలు ఉంటాయి. ముఖ్యంగా తయారీ రంగంలో కొత్త కార్మికులను నియమించుకునే యాజాన్యాలకు కనీసం ఆరు నెలల పాటు ఉద్యోగంలో కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ మద్దతు రెండు సంవత్సరాలు కొనసాగుతుంది. అదే తయారీ యూనిట్లకు అయితే ప్రోత్సాహక కాలాన్ని మూడు, నాల్గవ సంవత్సరాలకు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి,ఈపీఎఫ్ఓలో నమోదైన కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుని వారిని కనీసం ఆరు నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలైతే కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




