EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాల్లో రూ.4,000 కోట్లు జమ.. వెంటనే చర్యలు చేపట్టిన ప్రభుత్వం!
EPFO: ఉద్యోగం చేస్తున్న వారికి పీఎఫ్ అకౌంట్ తప్పకుండా ఉంటుంది. పని చేసే సంస్థ నుంచి కొంత.. ఉద్యోగి నుంచి కొత్త శాతం సాలరీలో కట్ చేసి ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఒకటి కాదు.. రెండు కాదు.. పీఎఫ్ అకౌంట్లో ఏకంగా 4000 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో కేంద్రం..

EPFO Account: లక్షలాది మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పదవీ విరమణ నిధి సంస్థ దాదాపు అందరి సభ్యుల ఖాతాలలో 2024-2025 (FY25) ఆర్థిక సంవత్సరానికి వడ్డీని జమ చేసిందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును ఆమోదించిన రెండు నెలల్లోపు కార్యకలాపాలను పూర్తి చేసిందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం అన్నారు. సభ్యుల PF డిపాజిట్లపై వడ్డీగా దాదాపు 4,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అయితే గతంలో లాగా కాకుండా ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ వడ్డీ జమ చేసేలా వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Best Smartphones: మీ బడ్జెట్ రూ.25,000లోపునా..? బెస్ట్ కెమెరా ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్లు ఇవే!
ఈ సంవత్సరం దాదాపు 335 మిలియన్ల సభ్యుల ఖాతాలతో 1.4 మిలియన్ సంస్థలకు వార్షిక ఖాతా అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. జూలై 8 నాటికి, 324 మిలియన్ల సభ్యుల ఖాతాలకు వడ్డీ జమ అయ్యింది. అంటే 99.9 శాతం సంస్థలు, 96.51 శాతం సభ్యుల ఖాతాలకు వార్షిక ఖాతాల అప్‌డేట్ పూర్తయినట్లు మంత్రి చెప్పారు.
మిగిలిన ఖాతాలలో వడ్డీ ఈ వారంలో జమ అవుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేయడం నెలల తరబడి ఆలస్యం అయ్యేదని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు కీలక నిర్ణయం..!
FY24 లో కూడా సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసే ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్‌లో పూర్తయిందని, వడ్డీ క్రెడిట్ వ్యవస్థలు ఇప్పుడు వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఆప్టిమైజ్ చేసినట్లు చెప్పారు. దీని కారణంగా మొత్తం ప్రక్రియ చాలా త్వరగా పూర్తవుతోందన్నారు మంత్రి. 2024-2025 సంవత్సరానికి EPFO ఫిబ్రవరి 28న 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 22న అధికారికంగా ఆమోదించింది. దీని ప్రకారం.. సన్నాహక కార్యకలాపాలు వెంటనే చేపట్టామని, అలాగే జూన్ 6 రాత్రి నుండి వార్షిక ఖాతాల అప్‌డేట్ ప్రారంభమైందని అన్నారు.
ఇది కూడా చదవండి: Minimum Balance Rules: పండగ లాంటి వార్త.. ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఛార్జీలు రద్దు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








