- Telugu News Photo Gallery Business photos No penalty on minimum balance: 6 banks that have removed savings accounts balance requirement
Minimum Balance Rules: పండగ లాంటి వార్త.. ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఛార్జీలు రద్దు!
No Minimum Balance Rules: పలు బ్యాంకులు సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) నిబంధనను తొలగించాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో పాటు అనేక బ్యాంకులు కూడా ఈ కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఎత్తివేస్తున్నాయి. దీంతో వినియోగదారులకు మేలు జరుగుతోంది. కనీస బ్యాలెన్స్ విధించే ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి. మరి ఆ బ్యాంకులు ఏవో తెలుసుకుందాం..
Updated on: Jul 10, 2025 | 11:54 AM

Minimum Balance Rules: ఈ రోజులలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటుంది. కానీ అకౌంట్ ఉన్నప్పటికీ ఓ సమస్య ఉంది. అదే మినిమమ్ బ్యాలెన్స్. అకౌంట్లో ఎప్పుడు కూడా కనీస మొత్తం ఉంచాల్సిందే. లేకుండా భారీ పెనాల్టీ ఛార్జీలు చెల్లించక తప్పదు. ఈ నిబంధన వల్ల చాలా మందికి సమస్యగా మారింది. బ్యాంకులు విధిస్తున్న ఈ నిమిమమ్ బ్యాలెన్స్ నిబంధనల వల్ల మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందిగా మారిపోయింది. చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న వారికి ఇదో సమస్యగా మారిపోయింది. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల కారణంగా సామాన్యులకు ఉపశమనం కలుగుతోంది.

1. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకు ఈ నెల అంటే జూలై 1 ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. సేవింగ్స్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది. అన్ని పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ షరతులను ఎత్తివేసింది. అంటే అన్ని సేవింగ్ ఖాతాలపై విధించే ఛార్జీని బ్యాంక్ ఆఫ్ బరోడా రద్దు చేసింది. కానీ ప్రీమియం సేవింగ్ ఖాతా స్కీమ్‌లపై మాత్రం ఈ ఛార్జీని రద్దు చేయలేదు.

2. కెనరా బ్యాంక్: ఈ బ్యాంకు కూడా అంతే ఈ ఏడాది మే నెల నుంచి అన్ని పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేసింది. వీటిలో శాలరీ అకౌంట్లు, ఎన్‌ఆర్‌ఐ అకౌంట్లు కూడా ఉన్నాయి.

3. ఇండియన్ బ్యాంక్: ఇక ఇండియన్ బ్యాంక్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి ఉపశమనం కలిగించింది. మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు ఎత్తివేసింది. అంటే అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు వేయదు. ఈ నిబంధనల జూలై 7 నుంచి అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


5. పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఈ బ్యాంకులో అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్‌పై విధించే నిబంధనను ఎత్తివేసింది. ఈ బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి ఛార్జీలు విధించదు.

6. బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంకు కూడా కనీస బ్యాంకు నియమాన్ని ఎత్తివేసింది. సేవింగ్ ఖాతాలకు కస్టమర్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించింది. దీని ప్రకారం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.




