AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E20 Petrol: పెట్రోల్ బంకుల్లో భారీ మార్పు.. కేంద్రం E20 పెట్రోల్‌నే ఎందుకు తీసుకువచ్చింది? అసలు కారణం ఇదే!

E20 Petrol: భారతదేశం తనకి అవసరమైన క్రూడ్ ఆయిల్ (ముడి చమురు)లో దాదాపు 88% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఈ అడుగు వేసింది..

E20 Petrol: పెట్రోల్ బంకుల్లో భారీ మార్పు.. కేంద్రం E20 పెట్రోల్‌నే ఎందుకు తీసుకువచ్చింది? అసలు కారణం ఇదే!
E 20
Subhash Goud
|

Updated on: Apr 07, 2026 | 4:29 PM

Share

E20 Petrol: భారతదేశంలోని వాహనదారులందరూ గమనించాల్సిన ముఖ్యమైన మార్పు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఇకపై దేశంలోని పెట్రోల్ బంకుల్లో లభించేది సాధారణ పెట్రోల్ కాదు, అది E20 పెట్రోల్. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని గతంలోనే తీసుకున్నప్పటికీ, ఏప్రిల్ 1 నుండి దీనిని తప్పనిసరి చేస్తోంది.

అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటి?

E20 పెట్రోల్ అనేది పెట్రోల్, ఇథనాల్ మిశ్రమం. ఇందులో 80% స్వచ్ఛమైన పెట్రోల్ ఉంటుంది. 20% ఇథనాల్ కలుపుతారు.

ఇథనాల్ అంటే ఏమిటి?

ఇథనాల్ అనేది వ్యవసాయ వ్యర్థాల ద్వారా తయారవుతుంది. ముఖ్యంగా చెరకు (Sugar cane) వ్యర్థాల నుండి దీనిని ఉత్పత్తి చేస్తారు. దీనికి కూడా పెట్రోల్ లాగే మండే స్వభావం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

భారతదేశం తనకి అవసరమైన క్రూడ్ ఆయిల్ (ముడి చమురు)లో దాదాపు 88% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

మీ వాహనంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

చాలామంది వాహనదారుల్లో ఉన్న ప్రధాన సందేహం – E20 పెట్రోల్ వాడితే మైలేజీ తగ్గుతుందా? ఇంజిన్ పాడవుతుందా? దీనికి సమాధానం మీ వాహనం కొన్న సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది:

2023 తర్వాత కొన్న వాహనాలు:

మీ కారు లేదా బైక్ 2023 తర్వాత తయారైనదైతే అది E20 ఇంధనానికి అనుకూలంగా (E20 Compatible) నిర్మించి ఉంటుందని గుర్తించకోండి. అందుకే మైలేజీ తగ్గదు. అలాఏగ వాహనం డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 2023 కంటే ముందు కొన్న వాహనాలు: పాత వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజీ కాస్త తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీర్ఘకాలంలో ఇంజిన్ భాగాలు కొంతవరకు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. పెట్రోల్ బంకుల్లో ఇప్పుడు లభించే ఇంధనం గురించి అవగాహన కలిగి ఉండటం ప్రతి వాహనదారుడికి అవసరం. మీ వాహనం పాతదైతే ఇంధన వినియోగంపై కాస్త నిఘా ఉంచడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us