AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar card: వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డుల డౌన్‌లోడ్.. వివరాలు మర్చిపోయినా నో టెన్షన్

ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును పొగొట్టుకున్నా, అత్యవసర సమయంలో మన దగ్గర లేకపోయినా వెంటనే ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీస్తాం. అక్కడ నిర్వాహకులు అడిగినంత డబ్బు ఇచ్చి వాటిని డౌన్ లోడ్ చేయించుకుంటాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇలాంటి ముఖ్యమైన పత్రాలను మర్చిపోతే చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదికూడా మన స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ యాప్ ద్వారా. ఇది నమ్మలేకున్నా వందశాతం నిజం. దానికోసం కొన్ని పద్దతులు పాటించాలి.

Aadhar card: వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డుల డౌన్‌లోడ్.. వివరాలు మర్చిపోయినా నో టెన్షన్
Pan Aadhaar
Nikhil
|

Updated on: Aug 10, 2024 | 8:12 PM

Share

ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును పొగొట్టుకున్నా, అత్యవసర సమయంలో మన దగ్గర లేకపోయినా వెంటనే ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీస్తాం. అక్కడ నిర్వాహకులు అడిగినంత డబ్బు ఇచ్చి వాటిని డౌన్ లోడ్ చేయించుకుంటాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇలాంటి ముఖ్యమైన పత్రాలను మర్చిపోతే చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదికూడా మన స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ యాప్ ద్వారా. ఇది నమ్మలేకున్నా వందశాతం నిజం. దానికోసం కొన్ని పద్దతులు పాటించాలి. నేటి కాలంలో దేశంలో ఆధార్, పాన్ కార్డులు కనీస అవసరాలుగా మారాయి. ఈ రెండు కార్డులూ లేకుండా అడుగు బయటకు వేయలేని పరిస్థితి నెలకొంది. మన దైనందిన వ్యవహారాలలో ప్రతి చోటా వీటి అవసరం ఏర్పడుతోంది. మన పర్సులో డబ్బులతో పాటు ఈ రెండు కార్డులకూ తప్పనిసరిగా చోటు ఉంచాల్సిందే. దేశ పౌరుడిగా ఆధార్ కార్డు మనకు గుర్తింపు ఇస్తుంది. ప్రభుత్వం పథకాలను పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక మన ఆర్థిక వ్యవహారాలలో పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది.

మర్చిపోయినా కంగారొద్దు

సాధారణంగా ఆధార్, పాన్ కార్డులను మనతోనే ఉంచుకుంటాం. ఒక్కోసారి మార్చిపోతే వెంటనే నెట్ సెంటర్లకు వెళ్లి డౌన్ లోడ్ చేయించుకుంటాం. ఈ పద్ధతి అందరికీ తెలిసిందే. కానీ మన వాట్సాప్ నుంచి ఈ రెండు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం చాలా సులువుగా ఈ పని పూర్తి చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో డౌన్ లోడ్ చేసే విధానం

  • ఈ సేవలను పొందటానికి ముందుగా మీ మొబైల్‌లో “మై గవర్నమెంట్” వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సేవ్ చేయాలి. దాని కోసం ఫోన్ డయలర్ అప్లికేషన్‌కి వెళ్లి 9013151515 నంబర్‌ను “మై గవర్నమెంట్” లేదా “డిజిలాకర్”గా నమోదు చేయండి. ఆ తర్వాత మీ వాట్యాప్ లో ఆ నంబర్ కనిపిస్తుంది.
  • సేవ్ చేసిన నంబర్ కు హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయాలి. నమస్తే అంటూ మీకు ఆటోమేటిక్ సందేశం వస్తుంది. దాని చివరిలో రెండు రకాల సేవల పేర్లు కనిపిస్తాయి. అవి కోవిన్ సేవలు, డిజిలాకర్ సేవలు అని ఉంటాయి.
  • వాటిలో డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి. అనంతరం మీకు డిజిలాకర్ ఖాతా ఉందా? అనే ప్రశ్న వస్తుంది. ఉంటే అవును, లేకపోతే కాదు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. ముందుగా మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను దానిలో నమోదు చేయండి. మీకు డిజిలాకర్ ఖాతా ఉన్నప్పటికీ మీరు ఈ దశలను అనుసరించాలి.
  • మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని దానిలో ఎంటర్ చేయండి. ఆ తర్వాత డిజిలాకర్‌లో సేవ్ చేసిన డాక్యుమెంట్లను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మార్క్ షీట్, లైసెన్స్ మొదలైన అన్ని పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ అనేది అధికారిక ప్రభుత్వ వాట్సాప్ చాట్ యాప్. కాబట్టి దాని భద్రత గురించి ఆందోళన చెందనవసరం లేదు.
  • డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ భారతీయ పౌరులకు ఇటువంటి ఫీచర్లను అందిస్తున్నారు. కాబట్టి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే వెబ్‌సైట్‌లకు వెళ్లి లాగిన్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే బదులు నాలుగైదు క్లిక్‌లతో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..