New FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఎస్‌బీఐ, పోస్టాఫీసుల్లో వడ్డీల్లో తేడాలివే..!

|

Jan 03, 2025 | 4:00 PM

భారతదేశంలో నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిలుస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడికి భరోసాతో పాటు నమ్మకమైన రాబడి కోసం ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతారు. అయితే ఎఫ్‌డీ చేసే వారు వడ్డీ రేటు విషయంలో జాగ్రత్తగా లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోతారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐతో పాటు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే ఎఫ్‌డీ పథకాల్లో వడ్డీ రేటు గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

New FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఎస్‌బీఐ, పోస్టాఫీసుల్లో వడ్డీల్లో తేడాలివే..!
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడులపై నమ్మకమైన, స్థిరమైన, దీర్ఘకాలిక రాబడిని అందజేస్తాయి. ఎఫ్‌డీల్లో పెట్టుబడి ద్వారా నిర్ణీత వ్యవధిలో మొత్తం డబ్బును డిపాజిట్ చేసి అవసరానికి అనుగుణంగా విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేస్తే కొన్ని చార్జీలను మినహాయిస్తే తక్షణమే డబ్బును పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎఫ్‌డీలు పొదుపు ఖాతాల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఎఫ్‌డీలు సాంప్రదాయక పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, పోస్టాఫీసుల్లో ఎఫ్‌డీల గురించి కీలక విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఎస్‌బీఐ భారతదేశపు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంకులో డిపాజిట్ వ్యవధి ఆధారంగా వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో వివిధ వడ్డీ రేట్లను అందిస్తుంది . ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలవ్యవధికి 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్‌పై 6.8 శాతం వడ్డీ, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7 శాతం, మూడు, నాలుగు సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీ లభిస్తుంది.

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్

ఇండియా పోస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తుంది. దీనిని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఖాతాలకు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అందువల్ల పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉంటుంది. జనవరి నుంచి మార్చి 2025 కాలానికి పోస్టాఫీసులు టీడీలపై 6.7 శాతం నుంచి 7.1 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు జనవరి 1, 2025 నుండి ప్రారంభమై, మార్చి 31, 2025తో ముగుస్తుంది. ఈ పథకంలో ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వడ్డీ రేట్లల్లో ప్రధాన తేడాలివే

ఎస్‌బీఐ ఒక సంవత్సరం ఎఫ్‌డీపై 6.8 శాతం వడ్డీ ఇస్తుంటే, పోస్ట్ ఆఫీస్ పథకం మాత్రం 6.9 శాతం వడ్డీ ఇస్తుంది. రెండేళ్ల డిపాజిట్‌పై రెండూ 7 శాతం వడ్డీ అందిస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ 6.75 శాతం వడ్డీ ఇస్తే పోస్టాఫీసు మాత్రం 7.1 శాతం వడ్డీ అందిస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ 6.5 శాతం వడ్డీ ఇస్తుంటే, పోస్టాఫీసు మాత్రం 6.7 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. వడ్డీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎస్‌బీఐతో పోలిస్తే పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో అధిక రాబడిని పొందవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి