AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health insurance: ఆరోగ్య పాలసీల్లో సుగర్ వ్యాధికి కవరేజీ ఉంటుందా..? పాలసీ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు మస్ట్

దేశంలో మధుమేహ వ్యాధి (సుగర్) బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. గతంలో దాదాపు 55 నుంచి 60 ఏళ్ల వారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువతను కూాడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని చుట్టేస్తోంది. దీంతో సుగర్ వ్యాధి రాజధానిగా మన దేశం మారిపోయే పరిస్థితి ఏర్పడింది.

Health insurance: ఆరోగ్య పాలసీల్లో సుగర్ వ్యాధికి కవరేజీ ఉంటుందా..? పాలసీ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు మస్ట్
Health Insurance
Nikhil
|

Updated on: Nov 16, 2024 | 6:45 PM

Share

మన దేశంలో 77 మిలియన్లకు పైగా మధుమేహ బాధితులున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 2045 నాటికి ఈ సంఖ్య 134 మిలియన్లకు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధిని కవర్ చేసే ఆరోగ్య పాలసీలను తీసుకోవడం చాలా అవసరం. ఇప్పటి మీకు పాలసీ ఉండే దాన్ని అప్ గ్రేడ్ చేసుకోండి. లేకపోతే వేరే బీమా సంస్థ పాలసీకి మారిండి. అయితే పాలసీ తీసుకు ముందు ఈ కింద తెలిపిన అంశాలను గమనించండి. మధుమేహం ఉన్నవారు పీఈడీ మినహాయింపు రైడర్ ఉన్న పాలసీని తీసుకోవాలి. సాధారణ ఆరోగ్య పాలసీలో బీమాదారుడికి ముందున్న వ్యాధులను కవర్ చేయడానికి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. అది రెండు నుంచి నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు. పీఈడీ మినహాయింపు రైడర్ తో ఈ వెయిటింగ్ పిరియడ్ తగ్గుతుంది. కొన్ని పాలసీలో మొత్తం తీసీవేస్తారు.

సుగర్ బాధితులు తరచూ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది. కొన్ని పరీక్షలు చేయించుకుని, మందులు వాడాలి. ఇవన్నీ ఔట్ పేషెంగ్ డిపార్ట్ మెంట్ (ఓపీడీ) కవరేజీ కిందకు వస్తాయి. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలు బీమా దారుడు ఆస్పత్రిలో చేరినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ఓపీడీ ఖర్చులను సొంతంగానే పెట్టుకోవాలి. కాబట్టి బీమా తీసుకునే ముందు ఓపీడీ రైడర్ ను ఎంచుకోవడం, లేదా ఈ సౌకర్యం ఉన్న పాలసీని తీసుకోవడం ఉత్తమం. సుగర్ బాధితులకు ఉపయోగపడే వివిధ సేవల ప్యాకేజీలను కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. వాటిని డయాబెటిస్ రివర్సల్ లేదా వెల్ నెస్ ప్రోగ్రామ్ లు అంటారు. ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. డయాబెటిస్ బాధితులకు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం, వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయడం చాలా అవసరం. కాబట్టి వార్షిక చెక్ అప్ లు, సమగ్ర నివారణ సంరక్షణ ప్యాకేజీలను తీసుకోవాలి. మధుమేహం బాధితులకు గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులను కవర్ చేసే క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ ను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

గమనించాల్సిన ముఖ్యాంశాలు

  • మీరు ఆరోగ్య పాలసీ తీసుకునే ముందు, యాన్ ఆన్ లను ఎంపిక చేసుకునే ముందు, కొత్త ప్లాన్ లో పెట్టుబడి పెట్టేముందు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బీమా కంపెనీకి తప్పకుండా తెలియజేయాలి.
  • అన్ని వ్యాధులు కవరయ్యే బీమా పాలసీని తీసుకోవడం చాలా అవసరం. దీనికి ప్రీమియం ఎక్కువైనప్పటికీ చాలా ఉపయోగంగా ఉంటుంది.
  • డే వన్ నుంచే కవరేజీ వర్తించే పాలసీలను తీసుకోవాలి. దీని వల్ల అత్యవసర సమయంలో చికిత్స వెంటనే అందుతుంది. దాదాపు 75 శాతం మధుమేహ బాధితులు ఇలాంటి పాలసీలనే కొనుగోలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి