AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: కేవలం రూ.11లకే 10జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎంతో తెలుసా..?

Jio Plan: తన వినియోగదారులకు జియో సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. ప్రైవేట్‌ కంపెనీలు టారీఫ్‌లు పెంచిన తర్వాత సరికొత్త ప్లాన్‌లను తీసుకువస్తున్నాయి. జియో నుంచి కేవలం 11 రూపాయలకే డేటా ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 10జీబీ డేటాను పొందవచ్చు..

Reliance Jio: కేవలం రూ.11లకే 10జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎంతో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Nov 16, 2024 | 3:00 PM

Share

రిలయన్స్ జియో కేవలం రూ.11కే 10జీబీ డేటా వోచర్‌ను అందిస్తోంది. ఇది 4G హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ వారి సాధారణ డేటా పరిమితిని దాటిన, తాత్కాలికంగా ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులకు సహాయపడుతుంది. ఈ రూ.11 రీఛార్జ్ బేస్ ప్లాన్ లేకుండా కూడా పని చేస్తుంది. ఈ రూ.11 రీఛార్జ్‌తో జియో కస్టమర్లకు 10 జీబీ 4జీ డేటా లభిస్తుంది. దీని వ్యవధి ఒక గంట మాత్రమే. ఇందులో ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రయోజనాలు ఉండవని గుర్తించుకోండి. ఒక గంట కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగం అవసరం ఉన్న వారికి తక్కువ ధరకే డేటాను అందించే మంచి ఆఫర్ ఇది.

మీ ఇంటర్నెట్ వినియోగం ఎక్కువ సమయం పాటు కావాలంటే ఈ రూ.11 ప్లాన్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒక రోజు లేదా 30 రోజుల వ్యాలిడిటీ లేదా బేస్ ప్లాన్ వ్యవధి వరకు చెల్లుబాటుతో డేటా రీఛార్జ్ వోచర్లను కొనుగోలు చేయవచ్చు. రూ.49 డేటా వోచర్‌పై మీకు కావలసినంత 4జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే, చెల్లుబాటు వ్యవధి ఒక రోజు మాత్రమే.

బూస్టర్ ప్యాక్ రూ. 19 నుండి ప్రారంభమవుతుంది. అలాగే రూ. 139 వరకు ఉంటుంది. ఇది బేస్ ప్లాన్ వ్యవధికి చెల్లుతుంది. 19కి ఒక జీబీ డేటా లభిస్తుంది. 139కి 12 జీబీ డేటా లభిస్తుంది. జియో నుండి ఇతర ప్లాన్‌లు కూడా ఉన్నాయి. 175 రూపాయల ప్లాన్‌కు 10GB డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు. అలాగే రూ.219 వోచర్ రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో పాటు 30 జీబీ డేటాను అందిస్తుంది. మీకు మరింత డేటా కావాలంటే, మీరు రూ. 359 రీఛార్జ్‌ని ఉపయోగించవచ్చు. ఇది 50GB డేటాను అందిస్తుంది. దీని వాలిడిటీ 30 రోజులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి