AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

paytm PostPaid: వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్న పేటీఎమ్‌.. 30 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అయితే..

Paytm: డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది పేటీఎమ్‌. డిజిటల్‌ పేమెంట్స్‌ను దేశంలో తొలిసారిగా పరిచయం చేసింది పేటీఎమ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో పెరుగుతోన్న పోటీని...

paytm PostPaid: వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్న పేటీఎమ్‌.. 30 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అయితే..
Paytm Postpaid Mini
Narender Vaitla
|

Updated on: Jul 06, 2021 | 8:55 PM

Share

Paytm: డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది పేటీఎమ్‌. డిజిటల్‌ పేమెంట్స్‌ను దేశంలో తొలిసారిగా పరిచయం చేసింది పేటీఎమ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో పెరుగుతోన్న పోటీని తట్టుకోవడానికి పేఎటీఎమ్‌ ఎప్పటికప్పుడు కొత్త సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పేటీఎమ్‌ తన యూజర్లకు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ భాగస్వామ్యంతో పేటీఎమ్‌ ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్‌ మిని పేరుతో లాంచ్‌ చేసిన ఈ సేవల ద్వారా యూజర్లు వడ్డీ లేని రుణాలను పొందొచ్చు. అయితే ఈ మొత్తం స్వల్పంగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా సమయంలో యూజర్లకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఎటువంటి వడ్డీ లేకుండా రూ.250 నుంచి రూ.1,000 వరకు స్వల్ప రుణాలను తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను ముప్పై రోజుల్లోపు తిరిగి చెల్లించాలి. ఇదిలా ఉంటే పేటీఎమ్‌ ఇప్పటికే రూ.60,000 వరకు ఇన్‌స్టాంట్‌ క్రెడిట్‌ను అందిస్తోంది. ఇక తాజాగా నెలవారీ ఖర్చుల కోసం చిన్న మొత్తంలో పోస్ట్‌పెయిడ్ మిని ద్వారా డబ్బులు పొందొచ్చు. ఇక ఈ నగదు తీసుకునేందుకు ఎలాంటి ఫీజులు, యాక్టివేషన్‌ ఛార్జీలు ఉండవు. కేవలం కన్వీనియన్స్‌ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. ఇదిలా ఉంటే పేటీఎం ఇటీవల ఐపీవోకు సిద్ధం అవుతోంది. దీని ద్వారా ఏకంగా రూ. 22 వేల కోట్లను సమీకరించాలని పేటీఎమ్‌ వ్యూహాలు రచిస్తోంది.

Also Read: Taapsee Pannu: తెలుగులో చాలా కాలం తర్వాత తిరిగి సినిమా చేస్తున్న బ్యూటీ..

Flipkart Phonepe: ఇకపై క్యాష్‌ ఆన్‌ డెలివరీ కూడా డిజిటల్‌ రూపంలో.. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకున్న ఫోన్‌ పే.

GHMC Free Water Scheme: ఇర‌వై వేల‌ ఉచిత మంచినీటి పథకానికి గడువు పెంపు..!