Flipkart Phonepe: ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ కూడా డిజిటల్ రూపంలో.. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకున్న ఫోన్ పే.
Flipkart Phonepe: కరోనా తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగింది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫుడ్ నుంచి లగ్జరీ వరకు అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడానికి...
Flipkart Phonepe: కరోనా తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగింది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫుడ్ నుంచి లగ్జరీ వరకు అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడం పట్ల కొందరిలో అభద్రత ఉంటుంది. అలాంటి వారు క్యాష్ ఆన్ డెలవరీకి మొగ్గు చూపుతుంటారు. అయితే ప్రొడక్ట్ డెలివరీ చేసిన సమయంలో వినియోగదారుడు కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వీలు కలిపించడానికి ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ‘క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న వినియోగదారులు.. ఫోన్ పే యుపీఐ ద్వారా డబ్లులు చెల్లించడానికి వీలు కల్పిస్తుంది’ అని ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా సమయంలో యూజర్ల వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ విషయమై ఫోన్ పే బిజినెస్ డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ.. ‘కొన్నేళ్లుగా యూపీఐ యాప్స్‌ను వినియోగిస్తున్నందుకు యూజర్లకు ధన్యవాదాలు. వస్తువుల డెలివరీ సమయంలో కొంతమంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేయడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ విధానం వల్ల డిజిటల్ ఇండియా లక్ష్యానికి కూడా ఉపయోగపడుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఫోన్‌పే, ఫ్లిప్ కార్ట్ చేసుకున్న ఈ ఒప్పందంతో వినియోగదారులు ఫోన్‌పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాంటాక్ట్ లెస్ ట్రాన్షాక్షన్స్‌కు వీలు కలుగుతుంది.
GHMC Free Water Scheme: ఇరవై వేల ఉచిత మంచినీటి పథకానికి గడువు పెంపు..!
Vaccination: ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే వ్యాక్సిన్.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం.