Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడి.. మూడేళ్లలో రూ. 50లక్షల రాబడి.. పూర్తి వివరాలు

ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది. ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ రూ. 1200లకు వెళ్లింది.  కంపెనీ షేర్లు ఏకంగా 84,018 శాతం పెరిగాయి. ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనిలో పట్టుబడులు పెట్టిన వారిపై కనకవర్షం కురిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడి.. మూడేళ్లలో రూ. 50లక్షల రాబడి.. పూర్తి వివరాలు
Money
Follow us

|

Updated on: Jun 27, 2024 | 3:44 PM

తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్స్. అయితే రాబడి ఎంత బాగా ఉంటుందో.. అంతే స్థాయిలో రిస్క్ కూడా వెంటాడుతుంది. ఏ రోజు, ఏ సమయంలో ఆ స్టాక్స్ పడిపోతాయో తెలీదు. రూ. లక్షల్లో వ్యాల్యూ అకస్మాత్తుగా జీరో అయిపోవచ్చు. స్టాక్ మార్కెట్లో అది సాధ్యమే. అయితే ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది. ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ రూ. 1200లకు వెళ్లింది.  కంపెనీ షేర్లు ఏకంగా 84,018 శాతం పెరిగాయి. ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనిలో పట్టుబడులు పెట్టిన వారిపై కనకవర్షం కురిసింది. భారీగా లాభపడ్డారు. లక్షాధికారులు అయిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

గత సోమవారం నాడు బీఎస్ఈలో షేర్లు రూ.1192.60 స్థాయిలో ముగిశాయి. కానీ ఇప్పుడు ఈ స్టాక్స్ 2 శాతం పెరుగుదలతో రూ.1216.45 స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 18, 2023న కంపెనీ షేర్ల ధర రూ.22.11గా ఉంది. అప్పటి నుంచి ఈ స్టాక్ రూ.1216.45కి చేరింది. అంటే కేవలం 9 నెలల్లోనే డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 5400 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6410.34 కోట్లు.

పరుగులు పెడుతున్న మదుపరులు..

ఈ స్టాక్ను కొనడానికి రష్ ఉంది. ఈ రోజు దీని ధర 18% పెరిగింది. రూ.లక్ష పెట్టుబడిపై రూ.50 లక్షల రాబడి వచ్చింది. గత 3 సంవత్సరాలలో డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 84,018 శాతం పెరిగాయి. అంటే అప్పుడు కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సొమ్ము రూ.50లక్షలు అయ్యింది. వాస్తవానికి ఈ కంపెనీ పవర్ ట్రాన్స్ మిషన్ పరికరాలను విక్రయిస్తుంది. ట్రెండ్లెన్ డేటా ప్రకారం, కంపెనీ షేర్ ధర గత ఏడాదిలో 62,603.60 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో స్టాక్ ధర 6 నెలల్లో 754 శాతం పెరిగింది.

బోనస్ షేర్ల పంపిణీ..

కంపెనీ తొలిసారిగా 2009లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇచ్చింది. అప్పుడు కంపెనీ 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. అదే సమయంలో, డైమండ్ పవర్ చివరిసారిగా 2013లో బోనస్ షేర్లను పంపిణీ చేసింది. అప్పుడు పెట్టుబడిదారులు 1:3 బోనస్ షేర్లను పొందారు. కంపెనీ చివరిసారిగా 2013లోనే ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు