AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Ticket Cancellation: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇక టిక్కెట్లను రద్దు చేసినా ఛార్జీలు ఉండవు!

Flight Ticket Cancellation: ఈ నిర్ణయం ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ప్రయాణికులకు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి లేదా సవరించడానికి కూడా ఎక్కువ సమయం ఉంటుంది. దీనివల్ల ఫిర్యాదులు తగ్గుతాయి. ఇంకా కొత్త మార్గదర్శకాల ప్రకారం..

Flight Ticket Cancellation: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇక టిక్కెట్లను రద్దు చేసినా ఛార్జీలు ఉండవు!
Subhash Goud
|

Updated on: Nov 04, 2025 | 4:11 PM

Share

Flight Ticket Cancellation: ప్రభుత్వం విమాన ప్రయాణికులకు ఓ శుభవార్త అందించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు ఇప్పుడు బుకింగ్ చేసుకున్న 48 గంటల్లోపు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు లేదా సవరించుకోవచ్చు. దీనికి ఎటువంటి అదనపు రుసుములు వసూలు చేయరు. ఈ ప్రతిపాదిత DGCA నియమం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితుల్లో తమ టిక్కెట్లను మార్చుకోవాలనుకునే లేదా రద్దు చేసుకోవాలనుకునే విమాన ప్రయాణికులకు ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వ్యక్తులు ఇకపై ఆర్థిక నష్టాలను చవిచూడరు.

ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

కొత్త నిబంధనల ప్రకారం మీరు ప్రయోజనాలను ఎలా పొందుతారు?

ఇవి కూడా చదవండి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమాన ప్రయాణికులకు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల వరకు ఉచిత సవరణ లేదా రద్దు విండోను అందిస్తుంది. అంటే ప్రయాణికుడు బుకింగ్ చేసుకున్న 48 గంటలలోపు తమ ప్లాన్‌లను మార్చుకుంటే, వారికి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరు. అలాగే రద్దు చేసిన లేదా సవరించిన టిక్కెట్ల మొత్తాన్ని త్వరగా తిరిగి చెల్లించాలని DGCA విమానయాన సంస్థలను ఆదేశించింది.

ఈ మార్పులు ఎందుకు చేస్తున్నారు?

రద్దు చేసిన టిక్కెట్లకు విమానయాన సంస్థలు గణనీయమైన రుసుము వసూలు చేస్తున్నట్లు విమాన ప్రయాణికుల నుండి DGCAకు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక వినియోగదారు సంస్థలు కూడా దీనిపై ఫిర్యాదు చేశాయి. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేయాలని DGCA నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ప్రయాణికులకు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి లేదా సవరించడానికి కూడా ఎక్కువ సమయం ఉంటుంది. దీనివల్ల ఫిర్యాదులు తగ్గుతాయి. ఇంకా కొత్త మార్గదర్శకాల ప్రకారం, వాపసు ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ప్రణాళిక చేశారు. ఇది ప్రయాణికులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇది కూడా చదవండి: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ పని చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిచిపోతుంది?

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి