Indi GO: ఇండిగోకు రూ.5 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ.. చిన్నారిని ఆపడమే కారణం..
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్ ఒక వికలాంగ చిన్నారిని రాంచీ విమానాశ్రయంలో ప్లైట్ ఎక్కకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్ ఒక వికలాంగ చిన్నారిని రాంచీ విమానాశ్రయంలో ప్లైట్ ఎక్కకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇండిగోకు రూ. 5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి రాంచీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లబోతున్నాడని రాంచీ ఎయర్‌పోర్ట్‌కు వచ్చారు. చిన్నారి భయాందోళనలు ఉందని.. దీని వల్ల విమానంలో ఉన్నవారు ఇబ్బంది పడతారని చిన్నారిని అడ్డుకున్నారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. అయితే ఈ ఘటనను వీడియో తీసిన తోటి ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ఘటన ఖండించారు. ఇది ఎవరికీ జరగకూడదని అన్నారు. ఈ కేసు విచారణను నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. కాగా ఈ సంఘటన మే 7వ తేదీన జరిగింది. ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. తాజాగా, మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. నాల్గవ త్రైమాసికంలో ఎయిర్‌లైన్ నష్టాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. మార్కెట్ అంచనాల కంటే ఎయిర్‌లైన్ నష్టమే ఎక్కువ. నష్టం ఉన్నప్పటికీ, రాబోయే సమయం కోసం ఎయిర్‌లైన్ దృక్పథం చాలా బలంగా ఉంది. ముందుకు సాగుతున్న వృద్ధిపై మేనేజ్‌మెంట్ చాలా సానుకూలంగా ఉంది. దీని కారణంగా ఇది స్టాక్‌లో కనిపించింది.