Detect Plastic Rice: మీరు తినే బియ్యం క్వాలిటీవేనా? ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించడం ఎలా?
Detect Plastic Rice: మీరు కొనుగోలు చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లయితే సులభంగా గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యంలో ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించడానికి ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బియ్యాన్ని వేసి చూడండి. నిజమైన బియ్యం మునిగిపోతుంది. అయితే ప్లాస్టిక్ బియ్యం..

Detect Plastic Rice: ఈ మధ్య కాలంలో చాలా వస్తువులు నకిలీగా మారిపోతున్నాయి. మార్కెట్లో నకిలీ వస్తువులు వ్యాపారం జోరుగా సాగుతోంది. చివరకు తినే బియ్యం కూడా నకిలీగా మారుతున్నాయి. అయితే ఇటీవల మార్కెట్లో ప్లాస్టిక్ రైస్ వస్తున్నాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రైస్ గోల ఎక్కువైపోతోంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించడం ఎలా అని టెన్షన్ పడుతున్నారు. మరి మీరు కొనుగోలు చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లయితే సులభంగా గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యంలో ప్లాస్టిక్ రైస్‌ను గుర్తించడానికి ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బియ్యాన్ని వేసి చూడండి. నిజమైన బియ్యం మునిగిపోతుంది. అయితే ప్లాస్టిక్ బియ్యం పైకి తేలుతుంది. అలాగే కొద్దిగా బియ్యాన్ని నిప్పుపై కాల్చితే ప్లాస్టిక్ బియ్యం కాలిపోతూ ప్లాస్టిక్ వాసన వస్తుంది.
నీటి పరీక్ష
➦ ఒక గ్లాసులో నీరు తీసుకోండి.
➦ కొన్ని బియ్యం గింజలను నీటిలో వేయండి.
➦ కొద్దిసేపు అలా వదిలివేయండి.
➦ నిజమైన బియ్యం నీటిలో మునిగిపోతుంది.
➦ ప్లాస్టిక్ బియ్యం నీటిపై తేలుతుంది..
మంట పరీక్ష:
➦ కొన్ని బియ్యం గింజలను తీసుకొని ఒక స్పూన్‌లో వేయండి.
➦ ఒక నిప్పును వెలిగించి బియ్యం గింజలను దాని దగ్గరగా పట్టుకోండి.
➦ నిజమైన బియ్యం అయితే కాలిపోదు లేదా చాలా తక్కువగా కాలుతుంది.
➦ ప్లాస్టిక్ బియ్యం అయినట్లయితే కాలిపోతుంది. అలాగే ప్లాస్టిక్ కరిగిపోతున్నట్లు కనిపిస్తుంటుంది.
➦ మీరు ప్లాస్టిక్ లాంటి వాసన కూడా రావచ్చు
మీరు ఇలాంటి ట్రిక్స్ పాటించడం వల్ల మనం తీనే బియ్యం మంచివో కావో సులభంగా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








