AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Scams: ప్లే స్టోర్‌లోనూ ఫేక్ యాప్స్.. వెంటనే అన్ఇన్‌స్టాల్ చేయపోతే మీ జేబు గుల్లే

ప్రస్తుత రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ ఫోన్స్‌లో వివిధ యాప్స్ ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటుంది. ఈ యాప్స్‌ చాలా వరకు గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఉంటాయి. అయితే గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్‌లు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణిస్తారు. చాలా నకిలీ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నా అవి ప్లే స్టోర్‌లో లేకుండా గూగుల్ చర్యలు తీసుకుంటుంది. అయితే ఇటీవల వెల్లడైన ఓ నివేదిక అందరినీ కంగారు పెట్టిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా నకిలీ యాప్స్ ఉన్నాయని తేలింది.

Crypto Scams: ప్లే స్టోర్‌లోనూ ఫేక్ యాప్స్.. వెంటనే అన్ఇన్‌స్టాల్ చేయపోతే మీ జేబు గుల్లే
Crypto Wallet Apps
Nikhil
|

Updated on: Jun 19, 2025 | 2:10 PM

Share

సైబర్ సెక్యూరిటీ కంపెనీ సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం గూగుల్ ప్లే స్టోర్‌లో 20 కంటే ఎక్కువ ప్రమాదకరమైన క్రిప్టోకరెన్సీ వాలెట్ యాప్‌లు కనుగొన్నామని స్పష్టం చేసింది. ఇవి వినియోగదారుల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి వారిని ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నకిలీ యాప్‌ల ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారుల నుండి 12 పదాల వాలెట్ రికవరీ పాస్‌వర్డ్‌ను దొంగిలించడం. ఏదైనా క్రిప్టో వాలెట్‌ను మళ్లీ యాక్సెస్ చేయడానికి లేదా పునరుద్ధరించడానికి ఈ పాస్‌వర్డ్ అవసరం. వినియోగదారు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత, హ్యాకర్లు అతని వాలెట్‌పై పూర్తి నియంత్రణను పొంది దానిలో ఉన్న అన్ని డిజిటల్ ఆస్తులను దొంగిలిస్తున్నారని నివేదికలో స్పష్టం చేశారు. 

ఈ యాప్‌లు పాత చెల్లుబాటు అయ్యే డెవలపర్ ఖాతాల ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారను. ఇవి గతంలో గేమింగ్ లేదా వీడియో యాప్‌లను సృష్టించాయి. దీంతో వినియోగదారులు వీటిని విశ్వసిస్తున్నారు. ఈ యాప్‌లు నకిలీ వెబ్‌సైట్‌లు, ప్యాకేజీ పేర్లు, అసలు యాప్‌ల మాదిరిగానే డిజైన్‌లను కలిగి ఉంటాయి. ఇవి ప్రజలను సులభంగా మోసం చేస్తాయి. ఈ యాప్‌లు సుషీస్వాప్, పాన్‌కేక్‌స్వాప్, హైపర్‌లిక్విడ్, రేడియం వంటి ప్రసిద్ధ దేఫి వాలెట్‌ల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఆ నకిలీ అప్లికేషన్‌లను ఏంటో ఓ లుక్కేద్దాం. 

ఆ వ్యాలెట్స్ ఇవే

  • సూట్ వాలెట్
  • సుషీస్వాప్
  • రేడియం
  • హైపర్‌లిక్విడ్
  • బుల్ఎక్స్ క్రిప్టో
  • పాన్కేక్ ఎక్స్చేంజ్
  • ఓపెన్ ఓషన్ ఎక్స్ఛేంజ్

వినియోగదారులు చేయాల్సిందిదే

  • మీరు మీ ఫోన్‌లో ఈ యాప్‌లలో దేనినైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. 
  • ఏ అనధికారిక యాప్‌లోనూ మీ వాలెట్ రికవరీ పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ నమోదు చేయవద్దు.
  • అధికారిక వనరులు లేదా వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే వాలెట్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలి. 
  • టూ ఫ్యాక్టర్ ప్రామాణీకరణను ఆన్ చేయండి.
  • మీ వాలెట్ కార్యకలాపాలను గమనిస్తూ ఉండాలి. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలను వెంటనే దర్యాప్తు చేయాలి. 

అన్‌ఇన్‌స్టాల్ ఇలా

  • మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లాలి. “యాప్‌లు” లేదా “యాప్‌లు & నోటిఫికేషన్‌లు”  ఎంచుకోవాలి. 
  • అనుమానాస్పద యాప్‌ల కోసం శోధించి వాటిని ఎంచుకోవాలి. 
  • పరికర నిర్వాహక యాక్సెస్ కారణంగా యాప్ తొలగించకపోతే “అన్‌ఇన్‌స్టాల్” చేయాలి.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?