AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోండి..

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారి సంఖ్య ఎక్కువైంది. అయితే చాలా మందికి క్రెడిట్ గురించి సరిగ్గా తెలియకపోవడంతో వివిధ చార్జీలు కడుతుంటారు. కొన్ని రూల్స్ పాటిస్తే బ్యాంకులు అధిక చార్జీలు వసూల్ చేయకుండా చేయవచ్చు. కాబట్టి మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

Credit Card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోండి..
Credit Cards
Krishna S
|

Updated on: Jul 13, 2025 | 5:52 PM

Share

చేతిలో డబ్బు లేకపోతే టక్కున గుర్తొచ్చేది బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య గత కొంత కాలంగా బాగా పెరిగింది. యూపీఐ వచ్చాక కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం చాలా పెరుగుతోంది. దీనికి కారణం క్రెడిట్ కార్డులు అందించే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, క్రెడిట్ సౌకర్యాలు మొదలైనవి అని మనకు తెలుసు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి క్రెడిట్ కార్డులు ఒక అద్భుతమైన సాధనం. కానీ చాలా మంది దీన్ని ఫుల్‌గా వాడేసి.. బిల్ కట్టేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీంతో చాలా మంది అప్పుల ఊబీలోకి వెళ్తున్నారు. అంతేకాకుండా కొన్ని తప్పులు క్రెడిట్ కార్డు కంపెనీలకు వరంగా మారతాయి. వివిధ రకాల ఫైన్‌లు, ఛార్జీలు మొదలైనవి విధిస్తాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని రుసుముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్

క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు.. వచ్చే బిల్లును చెల్లించడానికి గడువు ఉంటుంది. ఆ సమయంలోపు మొత్తం బిల్లును చెల్లించాలి. లేదా మినిమమ్ బిల్లు చెల్లించవచ్చు. గడువులోగా మీరు కనీస చెల్లింపును కూడా చేయకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు పడతాయి. సాధారణంగా, ఇది రూ. 300 నుండి రూ. 1,000 వరకు ఉంటుంది. అమౌంట్‌ను బట్టి మారుతుంది.

క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ ఛార్జ్

ప్రతి క్రెడిట్ కార్డుకు నిర్దిష్ట క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఇచ్చిన పరిమితిలోపు కార్డును ఉపయోగించాలి. ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డ్ రూ. 50,000 క్రెడిట్ పరిమితిని కలిగి ఉంటే, మీరు కార్డును ఉపయోగించి రూ. 50,000 కంటే ఎక్కువ ఖర్చు చేయలేరు. కానీ కొన్ని కార్డులపై ప్రత్యేక సమయాల్లో బ్యాంకులు లిమిట్‌ను వాడుకునే అవకాశం కాల్పిస్తుంది. కానీ ఓవర్‌లిమిట్ ఛార్జ్ విధిస్తుంది. ఈ ఛార్జ్ రూ. 500 నుండి రూ. 750 వరకు ఉండవచ్చు.

క్రెడిట్ కార్డు జీఎస్టీ రేటు ?

క్రెడిట్ కార్డులపై బ్యాంకులు జీఎస్టీ విధిస్తాయి. మీరు కార్డుపై ఉపయోగించే డబ్బు ఆధారంగా కాకుండా లేట్ పేమెంట్స్, ఓవర్ లిమిట్ ఛార్జ్, ఆన్యువల్ ఛార్జ్, ప్రాసెసింగ్ ఫీ మొదలైనవి. వీటికి సంబంధించి 18శాతం జీఎస్టీ వసూల్ చేస్తాయి. ఉదాహరణకు.. లేట్ పేమెంట్ ఛార్జీలు రూ. 600 అయితే, 18శాతం జీఎస్టీ అంటే రూ. 108 అవుతుంది. అంటే మొత్తం రూ. 708 కలిపి కట్టాల్సి ఉంటుందిన.

క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ

వీటితో పాటు చాలా క్రెడిట్ కార్డులకు ఫిక్స్‌డ్ ఆన్యువల్ ఫీజు కూడా ఉంటుంది. కనీస బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే, తదుపరి బిల్లులో మిగిలిన మొత్తంపై వడ్డీ వసూలు చేయబడుతుంది. మీరు ఆలస్యంగా చెల్లించినప్పటికీ.. మొత్తంపై వడ్డీ చెల్లించాల్సిందే. అదేవిధంగా మీరు మీ బిల్లును సకాలంలో చెల్లించకపోతే, లేదా మీరు క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తే, పైన పేర్కొన్న రుసుములతో పాటు మీ క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితమవుతుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఎటువంటి లోన్లు రావు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..