Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 63 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి..
కరోనా, లాక్‌డౌన్ నుంచి కోలుకున్న తర్వాత కంపెనీలు గత రెండేళ్లలో కోల్పోయిన తమ రూపాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి...
కరోనా, లాక్‌డౌన్ నుంచి కోలుకున్న తర్వాత కంపెనీలు గత రెండేళ్లలో కోల్పోయిన తమ రూపాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనివల్ల రానున్న కాలంలో అనేక ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో భారతదేశంలో జాబ్ మార్కెట్ చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. 63 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల్లో అంటే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రికవరీని వేగవంతం చేయడానికి, ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి ఉద్యోగాలను తీసుకుంటున్నాయని మంగళవారం చేసిన ఓ సర్వే తెలిపింది. ‘ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ ఆఫ్ మ్యాన్‌పవర్‌గ్రూప్’ సర్వే ప్రకారం, 2022 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ ఉపాధి ఔట్‌లుక్ చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. నికర ఉపాధి ఔట్‌లుక్ ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 51 శాతంగా ఉండవచ్చని అంచనా. సర్వే ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో, 63 శాతం కంపెనీలు హైరింగ్ స్థాయిలు పెరుగుతాయని అంచనా వేయగా, 12 శాతం మంది నియామకంలో కోతపై ఆందోళన వ్యక్తం చేశారు.
పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండదని 24 శాతం మంది తెలిపారు. మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటీ మాట్లాడుతూ, “పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు భౌగోళిక రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ, సంస్కరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, భారతదేశంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి అన్ని రంగాలలో సానుకూల సెంటిమెంట్ ఉంది. ఇంతకుముందు, కరోనా సంక్షోభం కారణంగా కంపెనీల డిమాండ్ ప్రభావితమైంది. దీని కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. దీనితో పాటు, కొత్త ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికను కూడా వెల్లడించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల రిక్రూట్‌మెంట్‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఉద్యోగాలు ప్రభుత్వంలోని వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలలో అందుబాటులో ఉంటాయి.