Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Critical Illness Policies: వ్యాధులను బట్టి ఆరోగ్య పాలసీలు మారతాయా.. తీవ్ర వ్యాధుల కోసం ఇవి బెస్ట్..

సాధారణంగా మనకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీల గురించి తెలుసు. వీటిని అనేక మంది తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నప్పుడే ఉపయోగపడతాయి. ఆ తర్వాత వైద్య ఖర్చులు, ఇతర వ్యయాల మాటేమిటి. అందుకోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి.

Critical Illness Policies: వ్యాధులను బట్టి ఆరోగ్య పాలసీలు మారతాయా.. తీవ్ర వ్యాధుల కోసం ఇవి బెస్ట్..
Critical Illness Insurance
Follow us
Madhu

|

Updated on: Jul 25, 2024 | 6:24 PM

ఆధునిక కాలంలో మనిషి ఎంతో ప్రగతి సాధించాడు. చంద్రుడిపై కూడా అడుగుపెట్టి చరిత్ర తిరగరాశాడు. ముఖ్యంగా పనిని వేగంగా సులభంగా పూర్తి చేసేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నాడు. జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోయేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిలో పడి తన జీవన విధానాన్ని మరిచిపోతున్నాడు. దీంతో అత్యంత వేగంగా, సులువుగా వ్యాధుల బారిన పడుతున్నాడు. మారిన అలవాట్లు, ఒత్తిడి, ఆహారం, కాలుష్యం తదితర కారణాలను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి.

వ్యాధుల దాడి..

గతంలో గుండెపోటు అంటే చాలా పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. దీంతో పాటు క్యాన్సర్, పక్షవాతం, కాలేయ సంబంధ వ్యాధులు దాడి చేస్తున్నాయి. వీటిని తట్టుకుని జీవనం సాగించడం చాలా కష్టంగా మారింది. ఆస్పత్రులలో లక్షలు ఖర్చు చేసి వైద్యం పొందాల్సి వస్తోంది. కష్టబడి సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో మనకు క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలు ఉపయోగపడతాయి.

గమనించాల్సిన అంశాలు..

సాధారణంగా మనకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీల గురించి తెలుసు. వీటిని అనేక మంది తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నప్పుడే ఉపయోగపడతాయి. ఆ తర్వాత వైద్య ఖర్చులు, ఇతర వ్యయాల మాటేమిటి. అందుకోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి.

క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలు..

దీర్ఘకాలిక చికిత్సలు అవసరమయ్యే వ్యాధుల విషయంలో క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలు ఉపయోగపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు తదితర వాటికి ప్రత్యేకంగా వీటిని చేయించుకోవాలి. ఈ పాలసీలు కనీసం రూ.5 లక్షల నుంచి మొదలవుతాయి. ఆయా బీమా సంస్థల నిబంధలను ప్రకారం గరిష్ట పరిమితి మారుతూ ఉంటుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక కూడా వైద్య ఖర్చులను తట్టుకునేలా ఈ పాలసీలు పరిహారం అందిస్తాయి.

  • బీమా సంస్థ ఏజెంట్ తో మాట్లాడి క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలను ఎంపిక చేసుకోవాలి. గుండెజబ్బులు, క్యాన్సర్.. ఇలా ఒక్కోదానికీ ప్రత్యేకంగా పాలసీ ఉంటుంది. వీటి ద్వారా వందశాతం బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • కుటుంబంలో తీవ్ర వ్యాధుల చరిత్ర ఉంటే ఇవి తప్పనిసరిగా అవసరమవుతాయి. అలాగే ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసేవారికి చాలా ఉపయోగపడతాయి.
  • సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోల్చితే వీటి వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది. దీర్ఘకాలిక చికిత్సలకు చాలా ఉపయోగపడతాయి.
  • క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలను త్వరగా క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న దాదాపు 90 రోజుల నుంచి ప్రయోజనాలు వర్తిస్తాయి. అయితే ఆయా బీమా కంపెనీల షరతులు, నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..