Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె పాండాల మధ్య దాగున్న నక్కలను కనిపెట్టండి చూద్దాం..!

మీ దృష్టి శక్తిని పరీక్షించడానికి మరో ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ మీ కోసం తీసుకొచ్చాను. ఈ చిత్రాన్ని బాగా గమనించండి. ఇందులో చాలా అందమైన రెడ్ పాండాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి మధ్య మూడు నక్కలు కూడా దాగున్నాయి. ఇప్పుడు మీ పని కేవలం 10 సెకండ్లలో ఆ నక్కలను గుర్తించడం. ఇది చిన్నపాటి ఛాలెంజ్ లాంటిదే. కానీ మీ అవగాహన, దృష్టి శక్తిని పరీక్షించడానికి ఇది అద్భుతమైన అవకాశం. మరి ఆలస్యం ఎందుకు..? వెంటనే ట్రై చేయండి.

Optical illusion: మీకు మంచి IQ ఉంటె పాండాల మధ్య దాగున్న నక్కలను కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion
Follow us
Prashanthi V

|

Updated on: Mar 23, 2025 | 10:16 PM

మీరు చూస్తున్న ఈ చిత్రం ఒక ఫోటో స్టూడియోను పోలి ఉంటుంది. ఇందులో రెడ్ పాండాలు నిలబడి కెమెరా కోసం పోజ్ ఇస్తున్నాయి. వీటిలో అన్నీ ఒకే తరహా లా కనిపిస్తున్నాయి. కానీ బాగా ఫోకస్ చేసి చూస్తే వాటి మధ్య మూడు నక్కలు దాగున్నాయి. అవి చాలా తెలివిగా కలిసిపోయాయి.. కాబట్టి అవి బయటకు కనిపించడమే కష్టం. మీరు ఈ పజిల్‌ను ఛాలెంజ్‌గా తీసుకొని వాటిని కనిపెట్టే ప్రయత్నం చేయండి.

ఈ రకమైన పజిల్స్ మన గమనించే శక్తిని మెరుగుపరిచేలా చేస్తాయి. మన మెదడును వేగంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. కేవలం 10 సెకండ్లలో మీరు ఈ 3 నక్కలను గుర్తించగలిగితే మీ దృష్టి శక్తి అద్భుతంగా ఉందని అర్థం. కానీ ఇది అంత సులభం కాదు. కొంతమంది కొంచెం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. మీ సహనానికి పరీక్ష ఇది.

Optical Illusion

ఈ రకమైన పజిల్స్ మన కళ్ల దృష్టిని మరింత మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. చిన్న చిన్న వివరాలను గమనించే సామర్థ్యాన్ని పెంచుతాయి. మన టాస్క్ విషయానికి వద్దామా.. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా.. ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది… సమయం అయిపోయింది. మరి మీరు నక్కలను గుర్తించారా..? లేదా ఇంకా కనిపెట్టలేకపోయారా..?

ఏమైనా హిండ్ ఇవ్వమంటారా..? హింట్స్ ఇస్తే ఆప్టికల్ ఇల్యూషన్ మజాను తగ్గించడమే అవుతుంది. కానీ మీకో చిన్న సూచన.. మీరు చిత్రాన్ని మరోసారి పూర్తిగా స్కాన్ చేసి చూడండి. కళ్లను పెద్దవిగా చేసి చూస్తే నక్కలు కనిపించే అవకాశం ఉంది. అవి రెడ్ పాండాల ఆకారాన్ని అనుకరిస్తూ దాక్కున్నాయి.  కాబట్టి మరింత ఫోకస్ చేసి చూడండి.

మీరు నక్కలను గుర్తించారా..? అయితే మీకు అభినందనలు. మీరు నిజంగా మంచి గమనించే శక్తి కలవారు. కొంతమంది ఇంకా కనిపెట్టేలేకపోయారు కదా.. ఏం చింతించకండి. మీకోసం నేను ఇమేజ్ లో నక్కలను సర్కిల్ చేసి పెట్టాను వెళ్లి చూడండి.

Optical Illusion 1