CSK vs MI Match Report: ముంబైను చిత్తు చేసిన చెన్నై.. 4 వికెట్ల తేడాతో విజయం..
Chennai Super Kings vs Mumbai Indians, 3rd Match: ఐపీఎల్-18లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై జట్టు తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు, రచిన్ రవీంద్ర అజేయంగా 65 పరుగులు చేశారు.

ఐపీఎల్-18లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైజట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. ఓపెనర్‌గా వచ్చి చివరి దాకా నాటౌట్‌గా నిలిచిన రచిన్ రవీంద్ర 59 పరుగులతో జట్టుకు విజయం అందిచంలో కీలకపాత్ర పోషించాడు. చెన్నై జట్టు తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు.
సామ్ కుర్రాన్ (4 పరుగులు) విల్ జాక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అరంగేట్రం చేసిన విఘ్నేష్ పుత్తూర్ దీపక్ హుడా (3 పరుగులు), శివం దుబే (9 పరుగులు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53 పరుగులు)లను అవుట్ చేశాడు.
చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 31 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, దీపక్ చాహర్ అజేయంగా 28 పరుగులు చేశారు. నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇరు జట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (w), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..