AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు రూ.5 లక్షల అప్పుందా? జీతం తక్కువ వస్తుందా? ఈ రూల్‌ పాటించండి!

నెలకు రూ.30,000 జీతంతో రూ.5 లక్షల అప్పును మూడేళ్లలో తీర్చడం సాధ్యమే. దీనికి కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ అవసరం. ఖర్చులను నియంత్రించి, అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. పొదుపు – తర్వాత ఖర్చు అనే సూత్రాన్ని పాటిస్తూ, EMIని ముందుగా చెల్లిస్తే అప్పు భారం తగ్గుతుంది.

మీకు రూ.5 లక్షల అప్పుందా? జీతం తక్కువ వస్తుందా? ఈ రూల్‌ పాటించండి!
Loan India
SN Pasha
|

Updated on: Apr 23, 2026 | 10:39 AM

Share

నెలకు రూ.30,000 జీతం పొందే వ్యక్తి మూడు సంవత్సరాల్లో రూ.5 లక్షల అప్పును తీర్చడం సాధ్యమే కానీ దానికి కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పరిమితంగా ఉన్నప్పటికీ సరైన విధంగా ఖర్చులను నియంత్రించి, ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటే అప్పు భారాన్ని తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మొదటిగా అప్పు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం.రూ.5 లక్షల అప్పును 3 సంవత్సరాల్లో (36 నెలలు) తీర్చాలంటే, సుమారుగా నెలకు కనీసం రూ.14,000 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం జీతంలో దాదాపు 45-50 శాతం అవుతుంది. అందువల్ల, ఖర్చులపై కట్టుదిట్టమైన నియంత్రణ అవసరం అవుతుంది.

ఆర్థిక నిపుణులు సూచించిన విధంగా ముందు పొదుపు – తర్వాత ఖర్చు అనే సూత్రాన్ని పాటించడం ఉత్తమం. జీతం వచ్చిన వెంటనే EMI కోసం అవసరమైన మొత్తాన్ని పక్కన పెట్టి, మిగిలిన డబ్బుతోనే జీవన ఖర్చులను నిర్వహించాలి. ముఖ్యంగా ఇంటి అద్దె, ఆహారం, ప్రయాణం వంటి అవసర ఖర్చులను మాత్రమే ప్రాధాన్యంగా ఉంచి, వినోదం, అనవసర కొనుగోళ్లు వంటి ఖర్చులను తాత్కాలికంగా తగ్గించుకోవాలి. ఇక అదనపు ఆదాయ మార్గాలను వెతకడం కూడా ఈ ప్రణాళికలో కీలక భాగంగా మారుతుంది. పార్ట్‌టైమ్ పనులు, ఫ్రీలాన్సింగ్ లేదా చిన్న వ్యాపారాల ద్వారా నెలకు కనీసం రూ.3,000 నుంచి రూ.5,000 వరకు అదనపు ఆదాయం పొందగలిగితే, అప్పు చెల్లింపు వేగం మరింత పెరుగుతుంది. అదనపు ఆదాయాన్ని పూర్తిగా అప్పు తీర్చడానికి మళ్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గించుకోవచ్చు.

ఇక అత్యవసర నిధిని పూర్తిగా విస్మరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న మొత్తమైనా ప్రతి నెల రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అత్యవసర నిధిగా ఉంచడం ద్వారా అనుకోని ఖర్చుల వల్ల మళ్లీ అప్పులో పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తంగా క్రమశిక్షణతో కూడిన ఖర్చు నియంత్రణ, అదనపు ఆదాయం, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే, తక్కువ జీతం ఉన్నవారు కూడా పెద్ద అప్పులను తక్కువ కాలంలోనే తీర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us