AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cars: సిట్రోయెన్ నుంచి సీఎన్‌జీ వెర్షన్ రిలీజ్.. ధర ఎంతో తెలుసా?

భారతదేశంలోని ప్రజలకు కారు అనేది ఓ సెంటిమెంట్. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఓ కలగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే కొనుగోలుదారులు కారు ధరతో అనంతరం దాని నిర్వహణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి సీఎన్‌జీ కార్లను అధికంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్రోయెన్ ఇండియా తాజాగా తన సీ3 కారులో సీఎన్‌జీ వెర్షన్ రిలీజ్ చేసింది.

Cars: సిట్రోయెన్ నుంచి సీఎన్‌జీ వెర్షన్ రిలీజ్.. ధర ఎంతో తెలుసా?
Citroen C3 Cng
Nikhil
|

Updated on: May 17, 2025 | 3:44 PM

Share

సిట్రోయెన్ ఇండియా సీ3 హ్యాచ్‌బ్యాక్ కోసం కొత్త సీఎన్‌జీ కిట్‌ను విడుదల చేసింది. సిట్రోయెన్ సీ-3 సీఎన్‌జీ డీలర్ స్థాయి సీఎన్‌జీ కిట్ ఆధారంగా పని చేస్తుంది. అయితే ఈ కారు ధర పెట్రోల్ వేరియంట్ కంటే రూ.93,000 ఎక్కువ. సిట్రోయెన్ సీ-3 సీఎన్‌జీ ప్రారంభ ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా ఉంది. ఈ కారు లైవ్, ఫీల్, ఫీల్ (ఓ), షైన్ అనే నాలుగు వేరియంట్లలో అందించనున్నారు. ఈ కారు ధర రూ. 7.16 లక్షల నుంచి రూ. 9.24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 

సిట్రోయెన్ కంపెనీ సీఎన్‌జీ భాగాలపై మూడు సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారంటీని అందిస్తోంది. ఇది ప్రామాణిక సీ-3 మాదిరిగానే ఉంటుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రెట్రోఫిట్మెంట్ పూర్తి చేసుకోవడానికి వారి సమీపంలోని సిట్రోయెన్ డీలర్షిప్‌ను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సిట్రోయెన్ సీ3 సీఎన్‌జీ కిట్‌ను 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌తో నడుస్తున్నప్పుడు 82 హెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ ఆధారిత వాహనాల్లో సాధారణంగా కనిపించే విధంగా సీఎన్‌జీ మోడ్ కోసం పవర్, టార్క్ గణాంకాలను సిట్రోయెన్ వెల్లడించనప్పటికీ సీ-3 సీఎన్‌జీ కోసం పవర్, టార్క్ గణాంకాలు దాని పెట్రోల్ ప్రతిరూపాలతో పోలిస్తే కొద్దిగా తగ్గుతాయని భావిస్తున్నారు. 

అలాగే ఈ కారు ఏఆర్ఏఐ సర్టిఫైడ్ 28.1 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మాత్రమే అందిస్తారు. అలాగే ప్రామాణిక పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే రైడ్ నాణ్యతను కొనసాగించడానికి వెనుక సస్పెన్షన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు సిట్రోయెన్ పేర్కొంది. సిట్రోయెన్ ఇండియా తన డీలర్షిప్ ద్వారా సీ-3 హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ కిట్ల సరఫరా, సంస్థాపన కోసం లోవాటోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కిట్ 55 లీటర్ల నీటికి సమానమైన సామర్థ్యంతో ఒకే సీఎన్‌జీ సిలిండర్‌తో కలిగి ఉంటుంది. ఈ కారు పూర్తి ట్యాంక్ సుమారు 170 నుంచి 200 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

సీఎన్‌జీ సీ3లో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7.0 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా ఓఆర్వీఎంలు, రియర్ పార్కింగ్ కెమెరా, డే/నైట్ ఐఆర్వీఎం, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు, రియర్ వైపర్, వాషర్, రియర్ స్కిడ్ ప్లేట్లు, రియర్ డీఫాగర్ వంటివి ఉంటాయి. ఈ కారు స్టాండర్డ్ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), టీపీఎంఎస్, హిల్ హెల్డ్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఇతర భద్రతా లక్షణాలను పొందుతూనే ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి