AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Longest Train Journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం..21 రోజుల పాటు జర్నీ

Longest Train Journey: ఈ రైలులో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, మీరు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వండిన ఆహారం, పానీయాలు, వసతి కోసం అన్ని ఏర్పాట్లు రైలులోనే చేర్చుతారు. అయితే, ఈ రైలులో ప్రయాణించడానికి, మీరు..

Longest Train Journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం..21 రోజుల పాటు జర్నీ
Subhash Goud
|

Updated on: May 17, 2025 | 12:08 PM

Share

Longest Train Journey: భారతదేశ రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. కొన్ని రైలు ప్రయాణాలు కొన్ని గంటలు, మరికొన్ని ఒకటి లేదా రెండు రోజులు ఉంటాయి. అయితే, ఓ రైలు ప్రయాణం మాత్రం ఒకటి లేదా రెండు రోజుల్లో లేదా ఒక వారంలో ముగియదు. ఈ ప్రయాణం పూర్తి కావడానికి దాదాపు ఒక నెల పడుతుంది.

ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం ఏకంగా 13 దేశాల గుండా కొనసాగుతుంది. 18,755 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణంగా రికార్డు సృష్టించింది. ఈ రైలు పోర్చుగల్‌లోని అల్గార్వే నుండి ప్రారంభమై సింగపూర్‌లో ముగుస్తుంది. మిర్రర్ నివేదిక ప్రకారం.. పోర్చుగల్ నుండి సింగపూర్ వరకు నడిచే రైలు ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం. ఈ మార్గంలో ఈ రైలు 13 దేశాలను ప్రయాణించి దాని గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

ఈ రైలు తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 21 రోజులు పడుతుంది. అంటే మీరు ఈ రైలులో టికెట్ బుక్ చేసుకుంటే, మీరు 21 రోజుల్లో వివిధ దేశాలకు ప్రయాణించి మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. అయితే, వాతావరణంలో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే ప్రయాణ సమయం పెరగవచ్చు.

18,755 కి.మీ.ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు పోర్చుగల్‌లోని అల్గార్వే నుండి ప్రారంభమై స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ మీదుగా సింగపూర్ చేరుకుంటుంది. దారిలో పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ వంటి నగరాల గుండా వెళుతుంది. ఈ రైలు ఛార్జీ కేవలం 1350 అమెరికన్ డాలర్లు. భారతీయ రూపాయలలో చూస్తే ఇది దాదాపు రూ.1,13,988.98, అంటే, మీరు యూరప్ నుండి ఆసియాకు కేవలం లక్ష రూపాయలలో ప్రయాణించవచ్చు.

ఈ రైలులో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, మీరు ఆహారం, పానీయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వండిన ఆహారం, పానీయాలు, వసతి కోసం అన్ని ఏర్పాట్లు రైలులోనే చేర్చుతారు. అయితే, ఈ రైలులో ప్రయాణించడానికి, మీరు అవసరమైన పత్రాలు, సీటు ఎంపిక, రెండు రైళ్ల మధ్య కనెక్షన్ మొదలైన వాటిని తనిఖీ చేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: Ambani, Adani: ముఖేష్‌ అంబానీ, ఆదానీల అదృష్టాన్ని మార్చిన కాల్పుల విరమణ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి