AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాంకు ఏదో తెలుసా.. డబ్బు లెక్కించాలంటే..

ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా 6.9 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. ఇది కేవలం ఆర్థిక సంస్థ కాదు.. చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే తొమ్మిది రెట్లు పెద్దదైన ఐసీబీసీ, దాని విస్తృత ప్రపంచ నెట్‌వర్క్‌తో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అసాధారణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాంకు ఏదో తెలుసా.. డబ్బు లెక్కించాలంటే..
World Largest Bank
Krishna S
|

Updated on: Nov 16, 2025 | 9:39 PM

Share

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనాకు చెందిన ఒక సంస్థ అసాధారణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆస్తుల విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా నిలిచింది. ఈ బ్యాంకు మొత్తం ఆస్తి విలువ ఎంతంటే.. ఆ సంఖ్యను లెక్కించడానికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఐసీబీసీ ఎంత పెద్దది?

ICBC అనేది కేవలం బ్యాంకు కాదు.. ఒక ఆర్థిక సముద్రం లాంటి సంస్థ. తాజా గణాంకాల ప్రకారం దాని మొత్తం ఆస్తి విలువ 6.9 ట్రిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.612.25 లక్షల కోట్లు. ICBC 2012 నుండి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా లేదా యూరప్‌లోని ఏ బ్యాంక్ కూడా ఇప్పటివరకు దీనిని అధిగమించలేకపోయింది.

SBI తో పోలిక

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆస్తుల పరంగా చాలా పెద్దదే. అయితే ICBC తో పోలిస్తే చాలా తక్కువ. ఎస్బీఐ మొత్తం ఆస్తుల విలువ రూ.67 లక్షల కోట్లు కాగా.. అది ICBC మొత్తం ఆస్తుల కంటే తొమ్మిది రెట్లు తక్కువ. ఈ నికర విలువ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే, ICBC కి ప్రపంచ స్థాయిలో సరిపోలగల సంస్థలు చాలా తక్కువని చెప్పవచ్చు.

ఐసీబీసీ చరిత్ర: ఎలా ప్రారంభమైంది?

చైనా యొక్క చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణల కాలంలో ICBC స్థాపించబడింది.1978లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ దేశంలో ఆర్థిక సంస్కరణలు, ఉదారవాద విధానాలను అవలంబించాలని నిర్ణయించింది. దీంతో పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి కొత్త సంస్థల అవసరం ఏర్పడింది. సెప్టెంబర్ 1983లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కేంద్ర బ్యాంకుగా మాత్రమే పనిచేయాలని నిర్ణయించి, దాని నుండి పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకింగ్ విధులను వేరు చేసింది. ఈ నిర్ణయం తర్వాత ICBC అధికారికంగా జనవరి 1, 1984న కార్యకలాపాలను ప్రారంభించింది.

ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్

ICBC కేవలం చైనాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఉనికిని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.16,456 శాఖలు ఉన్నాయి. వీటిలో 416 శాఖలు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియా, దక్షిణ అమెరికా వంటి ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఈ బ్యాంకు సింగపూర్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయబడింది. అయితే చైనా ప్రభుత్వమే దీని అతిపెద్ద వాటాదారుగా ఉంది. ICBC యొక్క ఈ విస్తారమైన నెట్‌వర్క్, అపారమైన ఆస్తుల విలువ దీనిని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెడుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి