Business Ideas: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే.. భారీ డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు! కొన్ని నెలల్లోనే లక్షల సంపాదన!
మీరు రూ.5-10 లక్షల పెట్టుబడితో లాభదాయక వ్యాపారం కోసం చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న సెంట్రింగ్ బిజినెస్ ఒక గొప్ప అవకాశం. నిర్మాణ రంగం విస్తరిస్తున్నందున, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల వల్ల సెంట్రింగ్ సేవలకు కొరత ఏర్పడింది.

మీ దగ్గర రూ.5 నుంచి రూ.10 లక్షల పెట్టుబడి పెట్టే అంత సామర్థ్యం ఉంటే.. మంచి డిమాండ్ ఉన్న ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది. కానీ, ఏ బిజినెస్ చేయాలో అవగాహన ఉండదు. దాదాపు ప్రతి పనికి అనుభవం ఉండాలి. ఆ పనిలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వ్యాపారం చేయాలంటారు. కానీ, కొన్ని వ్యాపారాలకు అలాంటి అనుభవం అవసరం లేదు. అందులో ఒకటి సెంట్రింగ్ బిజినెస్.
నిర్మాణ రంగం ఎప్పుడూ మూడు పువ్వులు ఆరు గాయాలుగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ రంగంలో ఒక భాగంగా ఉండే సెంట్రింగ్ చేస్తూ రెండు చేతులా సంపాదించుకోవచ్చు. పైగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కూడా లబ్ధిదారులకు మంజూరు కావడంతో దాదాపు ప్రతి చోటా కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా సెంట్రింగ్ బిజినెస్ మొదలు పెట్టాలంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పటికే ఉన్న సెంట్రింగ్ సెక్టార్ డిమాండ్‌ను తీర్చలేకపోతుంది. సెంట్రింగ్ లేక చాలా ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతోంది.
అందుకే ఓ రూ.5 లక్షలతో నాలుగు గదుల ఇంటికి సరిపడా సెంట్రింగ్ మెటీరియల్ (ఐరన్ షీట్లు, పిల్లర్ బాక్సులు, కర్రలు) కొనుగోలు చేసి, ఓ మంచి సెంట్రింగ్ మేస్త్రీ, కొంతమంది హెల్పర్స్‌ను మాట్లాడుకొని.. సెంట్రింగ్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మీరు చేయాల్సిందల్లా.. ఇంటి యజమానితో కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం, మేస్త్రీ, హెల్పర్స్‌కు రోజువారి వేతనాలు ఇస్తే సరిపోతుంది. కొన్ని నెలల్లోనే మీ పెట్టుబడి వచ్చేసి, ఆ తర్వాత లాభాలు పొందవచ్చు. పైగా మీరు కొన్న సెంట్రింగ్ మెటీరియల్ పాడైయ్యేది కాదు. ముందు ఒక ఇంటికి సరిపడ మెటీరియల్ కొని, ఆ తర్వాత వచ్చే రాబడితో మెటీరియల్ పెంచుకుంటూ పోతే సెంట్రింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
