Traffic Challan: ఇదేమి చిత్రంరా నాయనా..హెల్మెట్ లేదని కారు డ్రైవర్‌కు చలాన్..!
Traffic Challan: సోమవారం జారీ చేసిన చలాన్‌లో ద్విచక్ర వాహన ఉల్లంఘన గురించి ప్రస్తావించింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని అజ్నారా సొసైటీ క్రాసింగ్ దగ్గర నిలిపి ఉంచిన ఓ కారు ఫోటో ఉంది. ' నో -పార్కింగ్ ' జోన్‌లో ఆపి ఉంచినందుకు..

Traffic Challan: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల వినూత్నమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఇది రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉంది. ఘజియాబాద్‌లోని ఒక కారు యజమానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించనందుకు రూ. 1,000 జరిమానా విధించారు. అయితే ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పోలీసులు దీనిని మానవ తప్పిదంగా అభివర్ణించారు. సోషల్ మీడియాలో ఒక చలాన్ వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో ద్విచక్ర వాహన ఉల్లంఘన గురించి ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Vehicle Colour: ఏ రాశి వారికి ఎలాంటి రంగు వాహనం మంచిదో తెలుసా..?
జారీ చేసిన చలాన్‌లో ద్విచక్ర వాహన ఉల్లంఘన గురించి ప్రస్తావించింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని అజ్నారా సొసైటీ క్రాసింగ్ దగ్గర నిలిపి ఉంచిన ఓ కారు ఫోటో ఉంది. ‘ నో -పార్కింగ్ ‘ జోన్‌లో ఆపి ఉంచినందుకు కారు చిత్రాన్ని ట్రాఫిక్ సబ్-ఇన్‌స్పెక్టర్ క్లిక్ చేశారని అధికారులు తెలిపారు .
కానీ అనుకోకుండా ఆ ఫోటోను ద్విచక్ర వాహనం చలాన్‌పై ఉంచారని అధికారి తెలిపారు . ఈ సంఘటనపై స్పందిస్తూ, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సచ్చిదానంద్ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ.. ” ఇది కేవలం మానవ తప్పిదం. ఇది ఎలా జరిగిందనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము ” అని అన్నారు. చలాన్ కాపీని ఆన్‌లైన్‌లో పొందిన తర్వాత కారు డ్రైవర్ షాక్ అయ్యాడు. అతను దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే అధికారుల వివరణ తర్వాత ఈ విషయం సద్దుమణిగింది. ఎప్పుడో వేసిన చలాన్ గురించి ఇప్పుడు వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.
Without helmet challan of a car what’s happening in uttar pradesh @CMOfficeUP pic.twitter.com/sN5XSi2xnA
— Devesh Kansal (@kan40775) September 11, 2025
ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ వంటి నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డ్రైవర్ల మొబైల్ నంబర్‌కు ఆన్‌లైన్ చలాన్ చేరుతుంది. ఇది ట్రాఫిక్ వ్యవస్థకు కూడా చాలా ప్రయోజనం చేకూర్చింది. ఆన్‌లైన్ చలాన్ భయంతో ప్రజలు ఇప్పుడు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Auto News: వాహనదారులకు ఇది కదా కావాల్సింది.. ఈ కారు మైలేజీ 40కి.మీ.. రానున్న ఐదు బెస్ట్ కార్లు ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








