AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు కారు వర్షపు నీటిలో చిక్కుకుందా? ఈ పొరపాటు చేయకండి.. బీమా వర్తించదు!

ప్రతి నాణేనికి రెండు వైపులుంటాయి. ఇది వాతావరణానికి కూడా వర్తిస్తుంది. వర్షాకాలంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నా కొన్నిసార్లు వరదల కారణంగా వాహనాలు నీట మునిగి లక్షల్లో నష్టపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాము. ఈ కాలంలో వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కార్లు వర్షపు నీటితో ఎన్నో మునిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీరు కారు ఇంజిన్‌లోకి వెళ్తాయి. దీని..

మీరు కారు వర్షపు నీటిలో చిక్కుకుందా? ఈ పొరపాటు చేయకండి.. బీమా వర్తించదు!
Car Insurance
Subhash Goud
|

Updated on: Jul 16, 2024 | 10:26 AM

Share

ప్రతి నాణేనికి రెండు వైపులుంటాయి. ఇది వాతావరణానికి కూడా వర్తిస్తుంది. వర్షాకాలంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నా కొన్నిసార్లు వరదల కారణంగా వాహనాలు నీట మునిగి లక్షల్లో నష్టపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటాము. ఈ కాలంలో వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కార్లు వర్షపు నీటితో ఎన్నో మునిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీరు కారు ఇంజిన్‌లోకి వెళ్తాయి. దీని కారణంగా కారు దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తి కారుకు బీమా చేసినట్లయితే, అతను పూర్తి మొత్తాన్ని పొందుతాడా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి?

అయితే, మీ పాలసీని బట్టి పరిస్థితులు మారవచ్చు. ఒకవేళ మీ వాహనం నీటిలో చిక్కుకుపోయినట్లయితే, మీరు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. వాహనం నీటిలో ఉన్నప్పుడు దాన్ని స్టార్ట్ చేయకూడదు అంటే ఇంజిన్ స్విచ్ ఆఫ్‌లో ఉండాలి. ఇంజిన్‌లోకి నీరు చేరినట్లయితే, వాహనాన్ని నడపకండి. బదులుగా వాహనాన్ని బయటకు నెట్టండి. దాని ఫోటో, వీడియోను తప్పకుండా రికార్డ్ చేయండి. ఇది కాకుండా, బీమా కంపెనీ డిమాండ్ చేసిన పత్రాలను కూడా సిద్ధం చేయండి. ఆ తర్వాత మీ క్లెయిమ్ వివిధ షరతుల ఆధారంగా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆమోదిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Relationship Tips: భార్యలు పుట్టింటికి వెళ్లిన తర్వాత భర్తలు ఎక్కువ ఆ పనే చేస్తారట!

ఈ సందర్భంలో, బీమా కంపెనీ ముందుగా మీ కారు రిపేర్ కండిషన్‌లో ఉందా లేదా వంటి కొన్ని విషయాలను పరిశీలిస్తుంది. కారును సరిచేయగలిగితే, దాన్ని సరిచేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ వాహనం ప్రస్తుత ఐబీవీ విలువ కంటే వాహనాన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటే ఈ సందర్భంలో కంపెనీ వాహనాన్ని మొత్తం నష్టంగా ప్రకటిస్తుంది. మీకు ఐడీవీ విలువ ఇస్తారు.

IDV విలువ కంటే మరమ్మతు ఖర్చు తక్కువగా ఉంటే కంపెనీ మీ కారును రిపేర్ చేస్తుంది. IDV విలువ అనేది మీ కారు మంచి కండిషన్‌లో లేనప్పుడు కంపెనీ మీకు ఇచ్చే మొత్తం. ప్రతి సంవత్సరం వాహనం ఐడీవీ విలువ 10 శాతం తగ్గుతుంది.

ఇది కూడా చదవండి:  Mukesh Ambani: కోడలు రాధికకు వీడ్కోలు.. ముఖేష్ అంబానీ కళ్ళలో కన్నీళ్లు.. వీడియో వైరల్‌

ఎలాంటి బీమా అవసరం?

మనీ9 నివేదిక ప్రకారం.. మీరు మీ కారు సమగ్ర బీమాను పొందినట్లయితే, అటువంటి పరిస్థితిలో మీరు బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. మీరు సమగ్ర పాలసీని కలిగి ఉంటే, వర్షాకాలంలో చెట్లు పడిపోవడం లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల మీ వాహనానికి జరిగిన నష్టానికి మీరు పరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను సమగ్ర పాలసీలో మాత్రమే భర్తీ చేయవచ్చు.. కానీ థర్డ్ పార్టీ బీమాలో ఇలాంటివి వర్తించవని గుర్తించుకోండి.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లాభదాయకం కాదా?

అయితే, ఇప్పుడు ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి చేయడంతోపాటు థర్డ్ పార్టీ బీమా కూడా ఇందులో చట్టబద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది థర్డ్ పార్టీ బీమా తీసుకుంటారు. కానీ, మీరు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయే అవకాశం ఉన్న చోటికి వెళుతున్నట్లయితే, మీకు సమగ్ర కవరేజ్ అవసరం. ఈ బీమా నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు మీరు క్లెయిమ్ చేయలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి