సరైన జాబ్ దొరక్క మీరు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నారా.? ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన ఉందా.? మీకోసమే ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం.. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది మంచి ఉద్యోగాలను సైతం కాదని.. సొంతంగా స్టార్టప్స్ పెట్టుకోవడం లేదా వ్యాపారాలను చేయడాన్ని ఇష్టపడుతున్నారు. అందులో మీరు ఒకరైతే.. రండి.! ఈ వ్యాపారం ఏంటో చూసేద్దాం మరి..
బంగాళదుంప చిప్స్ తయారీ.. తక్కువ పెట్టుబడి పెట్టి.. ఈ బిజినెస్‌లో మంచి లాభాలు తెచ్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఇది అస్సలు ఎలాంటి రిస్క్ లేని బిజినెస్. చిప్స్ తయారు చేయడానికి మీరు కావాలంటే పెద్ద మెషిన్లను కొనుగోలు చేయవచ్చు లేదా.. కొన్ని పరికరాలను తీసుకుంటే చాలు. ఈ బంగాళదుంప చిప్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిందల్లా బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా, ముక్కలను కట్ చేస్తే కట్టర్, ఒక పెద్ద మూకుడు. వీటిని మీరు ఫ్రై చేసి.. ఆ తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్మొచ్చు.
వీటిని మీ ఇంటికి దగ్గరలో ఉండే హోల్‌సేల్ షాపులలో వస్తే.. ముడిసరుకుపై చేసిన ఖర్చు కంటే ఎక్కువ లాభమే వస్తుంది. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి వస్తాయి. ఎంత చూసుకున్నా రోజుకు మూడు నుంచి మూడున్నర వెయ్యి వరకు సంపాదించవచ్చు. మీరు ప్రతీసారి క్వాంటిటీ, క్వాలిటీ మెయింటైన్ చేస్తే.. సేల్స్ విపరీతంగా పెరుగుతాయి.. అలాగే లాభాలు కూడా అనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయి.