Mutual Fund SIP: మ్యూచువల్ ఫండ్స్‌పై బడ్జెట్ ఎఫెక్ట్.. ట్యాక్స్ పెంపుతో పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలోకి చేపట్టాక ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పన్ను విధానాలపై కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా మూలధన లాభాలపై పన్నును పెంచడంతో దీర్ఘకాలిక అవసరాల కోసం పెట్టుబడి పెట్టే వారికి పెద్ద దెబ్బ తగిలినట్టయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత నిధుల కోసం స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై ప్రభుత్వం పన్నులను పెంచింది.

Mutual Fund SIP: మ్యూచువల్ ఫండ్స్‌పై బడ్జెట్ ఎఫెక్ట్.. ట్యాక్స్ పెంపుతో పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం
Mutual Fund
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 28, 2024 | 12:20 PM

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలోకి చేపట్టాక ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పన్ను విధానాలపై కీలక సవరణలు చేశారు. ముఖ్యంగా మూలధన లాభాలపై పన్నును పెంచడంతో దీర్ఘకాలిక అవసరాల కోసం పెట్టుబడి పెట్టే వారికి పెద్ద దెబ్బ తగిలినట్టయ్యిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈక్విటీ ఆధారిత నిధుల కోసం స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై ప్రభుత్వం పన్నులను పెంచింది. పన్నుల పెంపు పెట్టుబడిదారులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎస్‌టీసీజీ పన్నును మునుపటి 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. అయితే ఎల్‌టీసీజీ పన్ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగింది. అయితే ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక సంవత్సరానికి రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచడంతో కొంత ఉపశమనం లభించినట్లయ్యింది. ఈ నేపథ్యంలో మూలధన లాభాలపై పన్ను విధింపు వల్ల ఏయే పెట్టుబడులు ప్రభావితమవుతాయో? ఓ సారి తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ 

ప్రతి ఎస్ఐపీ వాయిదాను పన్ను ప్రయోజనాల కోసం ప్రత్యేక పెట్టుబడిగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఎస్ఐపీల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలవారీ రూ. 10,000 పెట్టుబడి పెడితే హోల్డింగ్ వ్యవధితో పాటు వర్తించే పన్ను రేటును నిర్ణయించడానికి ప్రతి వాయిదా ఒక్కొక్కటిగా పరిగణిస్తారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు యూనిట్లను రీడీమ్ చేసినప్పుడు ఫస్ట్-ఇన్-ఫస్ట్-అవుట్ పద్ధతిని పాటిస్తారు.

ఈక్విటీ ఫండ్స్ 

ఎల్‌టీసీజీ పన్ను  పన్ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కొంచెం ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మినహాయింపు పరిమితిని రూ.1.25 లక్షలకు పెంచడం వల్ల చిన్న పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఎస్‌టీసీజీ పన్ను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఈ నిర్ణయం స్వల్పకాలిక ఈక్విటీ పెట్టుబడిదారులకు ఇబ్బందిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డెట్ ఫండ్స్‌

బడ్జెట్‌లో గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఓవర్సీస్ ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్‌లు)పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లను తగ్గించినప్పటికీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై సాధారణ ఆదాయపు పన్ను రేటులో పన్ను విధింపు కొనసాగుతుందని బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అందవుల్ల మ్యూచువల్ ఫండ్స్ ఈ వర్గీకరణ నుంచి ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లను మినహాయించి వారి ఆదాయంలో 65 శాతం కంటే ఎక్కువ డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం అనేది సెక్షన్ 50 ఏఏ కిందకు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌