Budget 2024: రాబోయే బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.8 వేలు?

|

Jun 25, 2024 | 8:16 PM

దేశంలో ప్రధానిగా మోడీ మూడో సారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్ ఎన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రైతుల కోసం కూడా పథకాలను ప్రవేశపెట్టింది. మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ఒకటి...

Budget 2024: రాబోయే బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.8 వేలు?
Pm Modi
Follow us on

దేశంలో ప్రధానిగా మోడీ మూడో సారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్ ఎన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రైతుల కోసం కూడా పథకాలను ప్రవేశపెట్టింది. మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000ల చొప్పున అందిస్తోంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది.

ఇటీవల ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా రైతులకు 17వ విడత పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ.20 వేల కోట్లను విడుదల చేశారు. ఈ విషయం అటుంచితే మోడీ ప్రభుత్వం త్వరలో రైతులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత దేశ పగ్గాలు చేపట్టిన మోడీ.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ( PM Kisan) సాయం పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Union Budget 2024: బడ్జెట్‌ ప్రసంగంలో ఈ పదాల అర్థం మీకు తెలుసా? ఆసక్తికర విషయాలు

ఇవి కూడా చదవండి

ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందించే ఈ సాయాన్ని రూ.8000కు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు గత ఏడాది నుంచి వస్తుండగా, ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెంచే అవకాశాలు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌లోనే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్న ప్రకటన చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అలాంటి ప్రకటన ఏమి చేయలేదు. ఇప్పుడు జూలైలో పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఈ పీఎం కిసాన్‌ సాయం పెంచే ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: SBI: కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త.. అదేంటో తెలుసా..?

ప్రధాని మోడీ ఇటీవల 17వ విడత రూ.20 వేల కోట్లు విడుదల చేశారు. అంటే ఏడాదికి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నట్లు. ఈ లెక్క చూస్తే రూ.6 వేల నుంచి రూ. 8 వేలకు సాయాన్ని పెంచితే కేంద్రపై అదనపు భారం పడుతుంది. అంటే రూ.15 వేల కోట్ల భారం పడనుంది. ఇప్పుడు రైతులకు ఈ సాయం పెంచినట్లయితే 18వ విడత నుంచి రూ.4వేలు అందించాల్సి ఉంటుంది. మరి రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: మీరు రూ.400ల ఫుడ్ ఆర్డర్ చేస్తే జోమాటోకు ఎంత లాభం వస్తుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి