Britain Government: యూకే వీసా రేట్లు పెరుగుదల.. ఇక ప్రయాణం మరింత ఖరీదు
6 నెలల వరకు వీసాలు, 2, 5, 10 సంవత్సరాల వీసాలు, ఆరోగ్య వీసాలు మొదలైనవన్నీ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. నైపుణ్యం కలిగిన కార్మికులు, వలసదారు ల వీసా రేట్లు కూడా నేటి నుండి పెంచుతున్నట్లు వెల్లడించింది. యూకే వీసా ఫీజు పెంపు భారతీయుల తో సహా విదేశీయులందరి కీ వర్తించనుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటీష్..

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ నేతృత్వంలో ని ప్రభుత్వం ఈరోజు వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని వర్గాలకు వీసా రుసుము పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.6 నెలల వరకు వీసాలు, 2, 5, 10 సంవత్సరాల వీసాలు, ఆరోగ్య వీసాలు మొదలైనవన్నీ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. నైపుణ్యం కలిగిన కార్మికులు, వలసదారు ల వీసా రేట్లు కూడా నేటి నుండి పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే బ్రిటన్ ప్రభుత్వం పెంచిన ఈ వీసా ఫీజు పెంపు భారతీయుల తో సహా విదేశీయులందరి కీ వర్తించనుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటీష్ హోమ్ ఆఫీస్ ప్రతినిధి ఈ విషయాన్ని తెలియజేస్తూ, ‘చాలా ముఖ్యమైన పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ సెక్టార్‌కు నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉన్న నేపథ్యం లో వీసా దరఖాస్తులకు రుసుము పెంచడం న్యాయంగా ఉంది’ అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
అయితే బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆరు నెలల వరకు వీసా రుసుము 15 జీబీపీ (గ్రేట్ బ్రిటన్ పౌండ్) పెరిగింది. అంటే ఈ స్వల్పకాలిక వీసా ధర రూ.1,500 పెరగనుంది. ప్రస్తుతం 100 జీబీపీ ఉన్న ఈ స్వల్పకాలిక వీసా ధర 115 పౌండ్లకు పెరగనుంది. అంటే దాదాపు రూ.11,500 అవుతుంది.
ఇక స్టూడెంట్ వీసా ఫీజు కూడా.. ఇంకా, స్టూడెంట్ వీసా ఫీజు 127 పౌండ్లు పెరుగుతుంది. దీనితో పాటు విదేశాల నుంచి విద్యార్థులు బ్రిటన్ సందర్శించడానికి వీసా పొందడానికి 490 జీబీపీ రుసుము చెల్లించాలి. దాదాపు 6 నెలల కంటే ఎక్కువ, 11 నెలల కంటే తక్కువ వ్యవధి గల షార్ట్ టర్మ్ కోర్సులను అభ్యసించే వీసా ఫీజులో ఎటువంటి పెరుగుదల ఉండదు.
వీసా ఫీజు పెంపు వివరాలు:
కుటుంబం, సెటిల్‌మెంట్, పౌరసత్వ వీసా రుసుము శాతం. 20 శాతం మేర పెరిగింది పని, సందర్శన వీసా రుసుము రూ. 15 శాతం పెరిగింది ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్ సంవత్సరానికి 1,035 జీబీపీ. ఆరు నెలల వరకు సందర్శన వీసా రుసుము 115 జీబీపీ విద్యార్థి వీసా ఫీజు 490 జీబీపీ ఉంది
అయితే 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రామాణిక స్పాన్సర్‌షిప్ (సర్టిఫికేట్ స్పాన్సర్‌షిప్) వీసా రుసుము 719 జీబీపీ. స్పాన్సర్‌షిప్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మిగ్రేషన్ రుసుము 1,420 జీబీపీ. వీటితో పాటు బ్రిటన్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఫీజులు కూడా పెంచారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి