AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best 125cc bikes: దూకుడులో ఈ రెండు బైకులదీ టాప్ గేరే.. ధరలోనే కొంచెం వ్యత్యాసం

దేశంలో ద్విచక్ర వాహనాల మార్కెట్ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. నిత్యం వివిధ కంపెనీల వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ప్రజలు తమ అవసరాలకు మేరకు కొనుగోళ్లు జరుపుతున్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుగుణంగా వివిధ మోడళ్లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం స్పోర్ట్ కమ్యూటర్ బైక్ లకు డిమాండ్ పెరిగింది.

Best 125cc bikes: దూకుడులో ఈ రెండు బైకులదీ టాప్ గేరే.. ధరలోనే కొంచెం వ్యత్యాసం
Bajaj Pulsar, Tvs Raider 125
Nikhil
|

Updated on: Oct 29, 2024 | 3:06 PM

Share

సాధారణ బైక్ లతో పోల్చితే వీటికి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. కొండలు, గుట్టలపై కూాడా సునాయాసంగా ఎక్కేస్తాయి. ప్రత్యేక డిజైన్ కారణంగా ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి సౌకర్యంగా ఉంటాయి. ఈ విభాగంలో బజాజ్ పల్సర్ ఎన్ 125, టీవీఎస్ రైడర్ 125 అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి మధ్య తేడాలు, ప్రత్యేకతలు, ధర తదితర విషయాలు తెలుసుకుందాం. పల్సర్, రైడర్ రెండు బైకులూ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ 125లో పల్సర్ లక్షణాలు కనిపిస్తున్నటికీ దాన్ని పూర్తిగా ఆధునీకరించారు. ముందుభాగంలో వోల్ఫ్ ఐ హెడ్ ల్యాంప్, వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్ కోసం ట్విన్ స్ట్రిప్స్ ఉన్నాయి. పెట్రోలు ట్యాంకు, ఐకానిక్ పల్సర్ ఫాంట్ తో పాటు ట్యాంక్ ష్రౌడ్ ఏర్పాటు చేశారు. టీవీఎస్ రైడర్ 125లో ఎల్ఈడీ ల్యాంప్ తో కొత్తగా డిజైన్ చేశారు. ట్యాంక్ గార్డులు, స్ట్పిట్ సీట్లు, స్లిమ్ టెయిల్ ల్యాంప్ ఆకట్టుకుంటున్నాయి.

పల్సర్ ఎన్ 125లో కొత్త 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 8500 ఆర్పీఎం వద్ద 11.83 బీహెచ్ పీ, 6వేల ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఐదు స్పీడ్ యూనిట్ గేర్ బాక్స్ అమర్చారు. టీవీఎస్ రైడర్ లో 125 సీసీ సింగిల్ సిలిండర్ అమర్చారు. ఇది గాలి – ఆయిల్ కూలింగ్ పొందుతుంది. 75 వేల ఆర్పీఎం వద్ద 11.22 బీహెచ్ పీ, 6 వేల ఆర్పీఎం వద్ద 11.2 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. దీనిలోనూ ఐదు స్పీడ్ గేర్ బ్యాక్స్ ఉంది. రెండు బైక్ ల ముందు భాగంలో టెలిస్కోపిక్, వెనుక వైపు మోనోషాక్ ఫోర్కులు ఏర్పాటు చేశారు. అలాగే ముందు 240 ఎంఎం డిస్క్, వెనుక 130 ఎంఎం డ్రమ్ ద్వారా బ్రేకింగ్ డ్యూటీలను అమర్చారు. అయితే రైడర్ దిగువ వేరియంట్ మాత్రం ముందు భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ తో వస్తోంది.

పల్సర్ 125లో బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. అయితే టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ లేవు. టీవీఎస్ రైడర్ లో బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే టీఎఫ్ టీ స్క్రీన్ ఉంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అమర్చారు. అయితే పల్సర్ లో టాప్ స్పెక్ వేరియంట్ కు మాత్రమే అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ 125 మోటారు సైకిల్ రూ.94,707 నుంచి రూ.98,707 ధరలో అందుబాటులో ఉంది. టీవీఎస్ రైడర్ 125 బైక్ రూ.84,868 నుంచి రూ.1.04,330 వరకూ పలుకుతోంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..