SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్‌ ఫీజు ఫ్రీ…

SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ కార్డు కస్టమర్లకు తీపికబురు అందించింది. టీవీ,.

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్‌ ఫీజు ఫ్రీ...
Sbi Emi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2021 | 8:33 AM

SBI Customers: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ కార్డు కస్టమర్లకు తీపికబురు అందించింది. టీవీ, వాషింగ్‌ మెషీన్‌, ఫ్రిజ్‌ వంటివి కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. మీకు సులభమైన ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎస్‌బీఐ. అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తోంది. ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లను ఈజీ ఈఎంఐ రూపంలో మార్చుకోవాడనికి అవకాశం కల్పిస్తోంది. దీంతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. రూ.1000కు రూ.52 ఈఎంఐ పడుతుంది.

అంతేకాదు మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. కస్టమర్లు వారి కొనుగోళ్లను ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజులో వందశాతం మాఫీ కల్పిస్తోంది. అంటే ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండానే ఈఎంఐలోకి మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ అకాశం ఎంతో ఊరట కలిగించినట్లవుతుంది.

ఈ మేరకు ఎస్‌బీఐ కార్డ్ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫ్లెక్సీ ఈఎంఐ ఆఫర్‌ మే 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. పెద్ద మొత్తంలో చేసిన కొనుగోళ్లను తక్కువ వడ్డీ రేటుతో ఈఎంఐలోకి మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే లావాదేవీలు జరిపిన 30 రోజుల్లోగా వెసులుబాటు పొందవచ్చు.

రూ.500కుపైన చేసిన ఏ లావాదేవీనైనా ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఈఎంఐ బుకింగ్‌ అమౌంట్‌ కనీసం రూ.2,500గా ఉండాలి. 6,9,12,24 నెలల కాలపరిమితితో ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ.1000కు రూ.52 చెల్లించాలి. అంటే రూ.10 వేలకు రూ.520 ఈఎంఐ.12 నెలలకు అయితే రూ.94, ఆరు నెలలకు రూ.174 పడుతుంది.

ఇవీ కూడా చదవండి: SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి